Uber: ప్రముఖ రైడ్-షేరింగ్ దిగ్గజం ఊబెర్ విచిత్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇది మన దేశంలో కాదు బెల్జియంలో. వినియోగదారుడి ఫోన్ లో తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఉబెర్ వీటిని ఖండించింది. బెల్జియన్ వార్తా పత్రిక డెర్నియర్ హ్యూర్ లోని ఓ నివేదిక ప్రకారం… తక్కువ ఫోన్ బ్యాటరీ ఉన్న సమయంలో ఉబెర్ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించింది.
Read Also: Rishab Shetty: బీజేపీకి కాంతారా స్టార్ సపోర్ట్.? బొమ్మైని కలిసిన రిషబ్ శెట్టి
దీనిపై ఓ పరిశోధన కూడా జరిగింది. రాజధాని బ్రస్సెల్స్ లో ఇలాంటివి జరుగుతున్నట్లు వార్తకథనం పేర్కొంది. బ్రెస్సెల్స్ లోని డెర్నియర్ హ్యూర్ కార్యాలయం నుంచి సిటీ సెంటర్ లోని రైడ్ బుక్ చేసేందుకు రెండు ఐ ఫోన్లను ఉపయోగించారు. ఒక దాంట్లో 84 శాతం బ్యాటరీ ఉండగా, రెండో దాంట్లో 12 శాతం బ్యాటరీ ఉంది. అయితే 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ కలిగిన యూజర్ కు 17.56 యూరోలు (రూ. 1,585), 84 శాతం బ్యాటరీ ఉన్న ఫోన్ యూజర్ కు 16.6 యూరోలు (రూ. 1498) ఛార్జ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని సదరు వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది.
అయితే ఉబెర్ ఈ ఆరోపనల్ని ఖండించింది. ఫోన్ లోని బ్యాటరీ ఎంత ఉందనేదానిపై ఛార్జీలు ఉండవని ఉబెర్ స్పష్టం చేసింది. యాప్ వినియోగదారుల బ్యాటరీ పర్సంటేజ్ ని కొలవదని చెప్పింది. ఇదే విషయాన్ని సదరు వార్త సంస్థకు వెల్లడించింది. దూరం, సమయం, డిమాండ్, టోల్ ఫీజుల సహా అనేక వేరియబుల్స్ ఆధారంగా కస్టమర్లకు ఛార్జీలను వసూలు చేస్తుందని, మొబైల్ బ్యాటరీ లెవల్స్ ఆధారంగా ధరలు పెంచుతున్నట్లు వచ్చిన వాదనల్ని కంపెనీ ఖండించింది.