Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
- నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన డ్రైవర్
- ధైర్యంగా ప్రతిఘటించిన ఉద్యోగిని
- సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు
- మహిళా సిబ్బంది భద్రతపై ఎయిర్పోర్ట్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు ప్రతిరోజు విధులకు వెళ్లేందుకు ఉపయోగించే క్యాబ్ డ్రైవరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. విధులకు వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్‌ను మళ్లించి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సమయస్ఫూర్తితో స్పందించిన ఉద్యోగిని డ్రైవర్‌ను తీవ్రంగా ప్రతిఘటించడంతో, పట్టుబడతాననే భయంతో నిందితుడు అక్కడి నుంచి వాహనంతో సహా పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలు వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఇలాంటి ఘటన ఎదురవడంపై ఎయిర్పోర్ట్ అధికారులు అత్యంత సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో పనిచేసే సిబ్బంది, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల రవాణా భద్రతా ప్రమాణాలపై అధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు