JioCinema: ఐపీఎల్ హక్కలను సొంతం చేసుకున్న తర్వాత జియో సినిమా చాలా మందికి దగ్గరైంది. అయితే ఇప్పుడు జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను తన జియో సినిమా యాప్ లోకి తీసుకురావాలని అనుకుంటోంది. ఇప్పటికే దేశంలో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలకు జియో సినిమా ద్వారా పోటీ ఇవ్వాలని రిలయన్స్ భావిస్తోంది. అయితే జియో సినిమా కంటెంట్ కు ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ తర్వాత ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధం అవుతోంది.
Read Also: IPL 2023 : పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకుంటుందా..? లక్నో టాప్ ప్లేప్ లోకి వెళ్తుందా..?
అయితే ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులకు సంబంధించి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది వయాకాప్ 18. జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను ఫ్రీగా అందిస్తోంది. దీంతో జియో సినిమా రీచ్ బాగా పెరిగింది. కొన్ని కోట్ల మంది జియో సినిమా ద్వారా ఐపీఎల్ మ్యచ్ లను వీక్షిస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచులు ఐపోయిన తర్వాత కొత్త కంటెంట్ యాడ్ చేయాలనుకుంటోంది. దీనికి ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ మ్యాచులను మాత్రం ఫ్రీగా అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఐపీఎల్ తో జియో సినిమాకు వచ్చిన ఆదరణను అలాగే కొనసాగించాలని రిలయన్స్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే స్ట్రీమింగ్ దిగ్గజంగా మార్చాలని యోచిస్తోంది.
ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగియనున్నాయి. ఆ లోపే కొత్త కంటెంట్ యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తోంది. ఐపీఎల్ ను మాత్రం యథాతధంగా వీక్షించవచ్చని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎంత మేర ఛార్జీలు వసూలు చేయాలనే దానిపై ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పటికే వ్యూయర్‌షిప్ లో జియో సినిమా అదరగొడుతోంది. తొలివారంలోనే 5.5 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 12న చెన్నై-రాజస్థాన్ మ్యాచును రికార్డు స్థాయిలో 2.2 కోట్ల మంది చూశారు. ఇదిలా ఉంటే ఇప్పుడైతే ఐపీఎల్ ఫ్రీగా చూస్తున్నాం కానీ, వచ్చే ఏడాది ఫ్రీగా ఇస్తారా..? లేదా.?? అనేది తెలియలేదు. అయితే నెటిజన్లు మాత్రం అలవాటు చేసి ఇప్పుడు ఛార్జంటున్నారని మండిపడుతున్నారు.