Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
- పుట్టగొడుగులు త్వరగా ఎందుకు పాడవుతాయి?
- కొనేటప్పుడు, కడిగేటప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు
- ఫ్రిజ్‌లో నిల్వ చేసే సరైన పద్ధతి ఇదే
- FSSAI చెప్పిన బెస్ట్ స్టోరేజ్ టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips : పుట్టగొడుగులు (Mushrooms) కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో బటన్, ఆయిస్టర్, మిల్క్ మష్రూమ్స్ వంటి పలు రకాలు సులభంగా దొరుకుతున్నాయి. అయితే, పుట్టగొడుగులు కొనుగోలు చేసిన కొద్ది రోజులకే జిగటగా మారిపోవడం, రంగు మారడం లేదా పాడైపోవడం మనం గమనిస్తుంటాం. వీటిలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. సరైన పద్ధతుల్లో శుభ్రం చేయడం, నిల్వ చేయడం ద్వారా పుట్టగొడుగులను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.
కొనుగోలు చేసేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు వహించాల్సిన జాగ్రత్తలు
పుట్టగొడుగులను కొనేప్పుడే గట్టిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పటికే మెత్తబడిన, నల్లటి మచ్చలు ఉన్న లేదా దుర్వాసన వస్తున్న వాటిని కొనకూడదు. చాలామంది పుట్టగొడుగులు నీటిని పీల్చుకుంటాయని అసలు కడగడమే మానేస్తారు, కానీ అవి మట్టి లేదా కంపోస్ట్‌లో పెరుగుతాయి కాబట్టి శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వీటిని ఎప్పుడూ నీటిలో ఎక్కువసేపు నానబెట్టకుండా, పారుతున్న నీటి కింద త్వరగా కడిగి, వెంటనే టిష్యూ పేపర్‌తో తడి లేకుంటే తుడిచేయాలి లేదా పొడి పేపర్ టవల్, చిన్న బ్రష్‌తో వాటిపై ఉన్న మట్టిని సున్నితంగా దూర్చవచ్చు.
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
నిల్వ చేసే ముందు ఈ పొరపాటు అస్సలు చేయకండి
పుట్టగొడుగులను ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి ముందు అస్సలు కడగకూడదు, వండే సమయానికి మాత్రమే వాటిని శుభ్రం చేయాలి. ముందే కడిగి ఫ్రిజ్‌లో పెడితే, అవి స్పాంజిలా నీటిని పీల్చుకుని త్వరగా కుళ్ళిపోతాయి. అలాగే నిల్వ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదు, ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల లోపల తేమ పెరిగి బూజు పట్టడానికి దారితీస్తుంది. దానికి బదులుగా బ్రౌన్ పేపర్ బ్యాగ్ (కాగితపు సంచి) లేదా పొడి గుడ్డ సంచిలో వదులుగా ఉంచి నిల్వ చేయాలి, ఇది అదనపు తేమను పీల్చుకుని అవి పాడవకుండా చూస్తుంది.
దీర్ఘకాల నిల్వ చిట్కా , ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సూచనలు
పుట్టగొడుగులను వారం కంటే ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, ముందుగా వాటిని కొద్దిగా వేడినీటిలో ముంచి తీసి (బ్లాంచింగ్) లేదా కొద్దిగా ఉడికించి ఆరబెట్టి, ఆ తర్వాత గాలి చొరబడని ఫ్రీజర్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటిని నేరుగా సూప్‌లు, గ్రేవీలు లేదా సలాడ్లలో వాడుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మార్గదర్శకాల ప్రకారం, పుట్టగొడుగులను రిఫ్రిజిరేటర్ ప్రధాన భాగంలో 2°C నుండి 5°C ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. తేమ ఎక్కువగా ఉండే వెజిటబుల్ డ్రాయర్లో పెట్టకుండా, రంధ్రాలున్న పేపర్ బ్యాగ్‌లోనే గాలి ధారాళంగా ప్రసరించేలా వదులుగా అమర్చడం సురక్షితం.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!