10 States withdraws general consent to CBI, including telangana: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరస్థితి ఏర్పడింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీనే కావాలని కట్టుకథలను అల్లుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే తెలంగాణ…
Gujarat Cable Bridge Collapse: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణాల సంఖ్య పెరుగతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో నదిలో మునిగిపోయి 35 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై మొత్తం 500 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో 400 మందిని రెస్క్యూ చేయగా.. మరో 100 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. రాజధాని అహ్మదాబాద్ నుంచి ప్రమాద స్థలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Maruti Suzuki Brezza CNG variants coming soon: అన్ని కార్ల కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాయి. అయితే మారుతి సుజుకీ మాత్రం ఈవీల కన్నా సీఎన్జీ కార్ల ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. మారుతి సుజుకీ నుంచి అత్యంత విజయవంతం అయిన బ్రెజ్జాను త్వరలో సీఎన్జీ వేరియంట్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. గతంలో మారుతి సుజుకీ విటారా బ్రెజ్జాగా ఉన్న కారును ఇటీవల కొత్తగా పేరు మార్చి బ్రెజ్జాగా, గ్రాండ్ విటారాగా రెండు మోడళ్లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది.
Toyota Fortuner car stolen at gunpoint: నడిరోడ్డుపై గన్ పాయింట్ లో ఓ వ్యక్తి తన టయోటా ఫార్చ్యూనర్ కారును కోల్పోయాడు. దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు యజమానికి గన్ గురిపెట్టి కారును ఎత్తుకెళ్లారు. నైరుతి ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో గన్ గురిపెట్టి 35 ఏళ్ల వ్యక్తి నుంచి కారును దొంగిలించారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. శనివారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్ […]
Gujarat Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్చీ ప్రాంతంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన ఆదివారం సాయంత్ర కూలిపోయింది. దీంతో కేబుల్ బ్రిడ్జిపై ఉన్న దాదాపుగా 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. పునర్నిర్మాణం తరువాత ఐదు రోజుల క్రితమే కేబుల్ వంతెను పున:ప్రారంభించారు.
Student Assaulted By Teacher in UP: కామాంధులు బరి తెగిస్తున్నారు. వావీ వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలోొ ఉండీ.. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే.. దారి తప్పాడు. తను చదువు చెప్పే విద్యార్థినిపై కన్నేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని డియోరియాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోవడవతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఉన్నతాధికారులకు తెలియజేయడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు…
RSS Is Real Coffee, BJP Just The Froth Says Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ-ఆర్ఎస్ఎస్ బంధాన్ని కాఫీ కప్ తో పోల్చారు. ఆర్ఎస్ఎస్ కాఫీ అయితే.. దానిపై నురగలాంటిది బీజేపీ అని అన్నారు. బీహార్ రాష్ట్రంలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని లారియా వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కాంగ్రెస్ పునరుద్ధరించడం ద్వారానే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని గ్రహించడానికి తనకు చాలా సమయం పట్టిందని.. నితీష్ కుమార్, జగన్మోహన్…
PM Narendra Modi Launches TATA-Airbus Plane Project In Gujarat: గుజరాత్ వడోదరలో టాటా-ఎయిర్ బస్ విమాన ప్రాజెక్టుకు ఆదివారం శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ. 22,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టును భారతదేశాని పెద్ద అడుగుగా ప్రధాని అభివర్ణించారు. భారత వైమానిక దళం కోసం సీ-295 రవాణా విమానాలను టాటా-ఎయిర్ బస్ తయారు చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమానయాన రంగంలో భారత్ స్వావలంబన దిశగా సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు.
Maruti Suzuki recalls 9,925 units of Wagon R, Celerio and Ignis: ప్రముఖ కార్ మేకర్ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. 9,925 యూనిట్ల వ్యాగన్ ఆర్, సెలెరియో, ఇగ్నిస్ కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్ లో లోపాలు ఉన్న కారణంగా ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 1 మధ్య తయారైన ఈ మోడళ్ల…
"Please Save Democracy," Mamata Banerjee Urges Chief Justice of India: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ఆమె భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్యుజెఎస్) స్నాతకోత్సవానికి హాజరైన సిజెఐ జస్టిస్ యుయు లలిత్ సమక్షంలో మమతా బెనర్జీ ఈ…