Covid-19: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న 10,000లను దాటిని కేసుల సంఖ్య, ఈ రోజు 11,000లను దాటింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 9 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లలో కొత్తగా కేసుల సంఖ్య 11,109గా నమోదు అయ్యాయి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం 49,622కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిన డేటా ప్రకారం.. రోజూ వారీ కేసులం సంఖ్య 236 రోజుల గరిష్టానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 29 మంది మరణించారు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో ఒక్కొక్కరు ముగ్గురు, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌ల నుంచి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో 5,31,064 మరణించారు.
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. పుదుచ్చేరి, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేశాయి. ఇక నోయిడాలో స్కూళ్లు, ఆఫీసుల్లో మాస్కులను తప్పనిసరి చేసింది. కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB.1.16 సబ్ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో 10 రోజుల వరకు కేసుల సంఖ్య పెరగుతూనే ఉంటుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కేసులు ఎండమిక్ స్టేజ్ లో ఉన్నాయని, ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయని చెబుతున్నారు.