PM Narendra Modi celebrates Diwali with army: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, భారత సైనికులతో దీవపాళి వేడుకలను జరుపుకున్నారు. కార్గిల్ సెక్టార్ లో భారత సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతీ దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యమని సైనికులతో అన్నారు. తమ ప్రభుత్వం యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని అన్నారు.
Coimbatore Cylinder Blast: తమిళనాడు కోయంబత్తూర్ నగరంలో గ్యాస్ సిలిండర్ పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్ తీసుకుని వస్తున్న నలుగురు యువకులు వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కోయంబత్తూర్ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే ఈ పేలుడుపై తమిళనాడు పోలీసులు విచారణ…
Ebola outbreak in Uganda: ఉగాండాలో ఎబోలా కలకలం రేపుతోంది. ఆ దేశంలో వరసగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాజధాని కంపాలాలో కొత్తగా 9 ఎబోలా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 14 కేసులు నమోదు అయ్యయాని అక్కడి ఆరోగ్య మంత్రి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో సెంట్రల్ ఉగాండాలోని గ్రామీణ ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి ప్రారంభం అయింది. ఈ నెలలో రాజధాని కంపాలాకు ఈ వ్యాధి వ్యాపించింది. 16 లక్షల జనాభా ఉంటే కంపాలాలో వ్యాధి వ్యాపిస్తుండటం…
Imran Khan's plea against politics ban rejected by Pakistan court: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరస షాక్ లు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అనేక కేసులు ఇమ్రాన్ ఖాన్ పై నమోదు అయ్యాయి. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన…
Governor vs CM in Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా తయారైంది అక్కడి పరిస్థితి. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30లోగా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ రాజకీయ దుమారం ఏర్పడింది. ఈ వివాదాస్పద ఆదేశాలను విచారించేందుకు కేరళ హైకోర్టు ఈ…
Foreign Funding Licence Of Gandhis NGOs Cancelled: గాంధీ కుటుంబానికి చెందిన రెండు ఎన్జీవోలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)ల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద కేంద్రం ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకుంది. ఈ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరో కేసులో…
Chemicals in hair straightening products linked to uterine cancer: మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ కాన్సర్లు ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్లతో పాటు గర్భాశయ క్యాన్సర్లు మహిళల్లో తరుచుగా వస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తుల్లోని రసాయనాలు గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయని తేలింది. అమెరికాలో 33,497 మంది మహిళలపై నిర్వహించిన ఆధ్యయనంలో ఈ విషయం తెలిసింది. మనం సౌందర్యానికి, మంచి హెయిర్ స్టైల్ కు వాడే రసాయనాలే క్యాన్సర్…
Karnataka Minister Slaps Woman: కొంతమంది నేతల దురుసు ప్రవర్తన ఆయా పార్టీలకు చేటు తెస్తున్నాయి. అధికారం తలకెక్కిన నాయకులు ప్రజలతో ఎలా నడుచుకోవాలనేది తెలియడం లేదు. ఆగ్రహంతో ప్రజలను దూషించడం, చేయి చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళపై చేయి చేసుకున్నారు ఓ మంత్రి. అధికారంలో ఉన్న వ్యక్తి, మంత్రి అయి ఉండీ మహిళ చెంపపై కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో మంత్రి…
UP Govt investigating Namaz in train: రైలులో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనిపై కొన్ని మంది సానుకూలంగా ఉండగా.. మరికొంత మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి షేర్ చేసిన ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా రైలులో నమాజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై దీప్లాన్ భారతి రైల్వేకు, యూపీ పోలీసులకు ఫిర్యాదు…
physical assault on nurse In Chhattisgarh: మరో మహిళపై అత్యాచారం జరిగింది. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. ఓ ఆరోగ్య కేంద్రంలోనే నర్సపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. నలుగురు వ్యక్తులు నర్సును కట్టేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్దారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనలో మైనర్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. పోలీసులు నాలుగో నిందితుడి…