16 Indian Army jawans killed in road accident in Sikkim: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లతో ప్రయాణిస్తున్న టక్కు లోయలో పడింది. ఉత్తర సిక్కిం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఏటవాలుగా ఉన్న రోడ్డు నుంచి ట్రక్కు జారిపోయి లోయలో పడింది
Bomb threat to Bangalore airport.. Engineering student arrested: బెంగళూర్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఆందోళన పెంచేలా ట్వీట్ చేసినందుకు బెంగళూర్ ఈశాన్య క్రైమ్ పోలీసులు గురువారం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు వైభవ్ గణేష్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూర్ లోని దక్షిణ ప్రాంతంలోని కుడ్లు గేట్ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు.
Suicide blast in Pakistan's Islamabad: దాయాది దేశం పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని ఇస్లామాబాద్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇస్లామాబాద్ లోని అత్యంత కట్టుదిట్టమైన, దేశ పార్లమెంట్, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వెళ్లే దారిలో ఈ ఘటనల జరగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. పేలుడు సంభవించిన వెంటనే ఉగ్రవాద వ్యతిరేక దళం ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ పేలుడులో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా.. నలుగురు పోలీసులు గాయపడ్డారు. మరణించిన పోలీస్ అధికారిని అదీల్ హెస్సేన్ గా గుర్తించారు.
RJD leader Abdul Siddiqui on Muslims feeling insecure in India: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. బీహార్ మాజీ మంత్రి అయిన సిద్ధిఖీ.. తన కొడుకు, కూతుర్లకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని, వీలైతే అక్కడే పౌరసత్వం కూడా ఇప్పించాలని కోరానని సిద్ధిఖీ అన్నారు.
Russia accuses USA of being at an indirect war: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. జెలన్స్కీ పర్యటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇక చర్చల అంశం ప్రస్తావనకు రానే రాదని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన యుద్ధం 10 నెలలుగా సాగుతోంది. అయితే తొలిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశం వదిలి అమెరికా పర్యటనకు…
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Errabelli Dayakar Rao criticizes Chandrababu Naidu: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదని అన్నారు. టీడీపీ ఎన్టీరామారావు పార్టీ అని అన్నారు. మధ్యలో వచ్చినవాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఎన్టీఆర్‌ని చంద్రబాబు మోసం చేశాడని.. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగా తన కొడుకును లోకేష్ ను ఫోకస్ చేయాలని చంద్రబాబు…
Prime Minister Narendra Modi's high-level meeting on Covid: కోవిడ్-19 మహమ్మారిపై ప్రధాని నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనావ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 విజృంభిస్తుండటంతో ఇండియా కూడా అప్రమత్తం అయింది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నిపుణులతో, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ కోవిడ్ పరిణామాలపై అత్యున్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Nihita Biswas, the loving wife of Bikini Killer Charles Sobhraj: చార్లెస్ శోభరాజ్ ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియని పేరు అయితే 1970లో వరస హత్యలతో సంచలనం సృష్టించాడు. ‘‘బికిని కిల్లర్’’గా పేరొందాడు. అయితే మొత్తం 20కి పైగా హత్యలు చేసినట్లు శోభరాజ్ పై అభియోగాలు ఉన్నాయి. ఇద్దరు అమెరికన్లను హత్య చేసిన నేరం కింద ప్రస్తుతం నేపాల్ లో శిక్ష అనుభవిస్తున్నాడు. నేపాల్ సుప్రీంకోర్టు శోభరాజ్ ను విడుదల చేయాలని తీర్పు చెప్పింది
China Covid surge, 1 million cases daily: ప్రపంచ ఇప్పటి వరకు చూడని ఉత్పాతాన్ని చైనా ఎదుర్కోబోతోంది. కోవిడ్ వల్ల ఆ దేశం ఉక్కిరిబిక్కిరి కాబోతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ రాకెట్ వేగంతో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో అక్కడి ప్రజల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజూ 10 లక్షల కేసులు, 5000 మరణాలు నమోదు అవుతున్నాయిన.. లండన్‌కు చెందిన అనలిటిక్స్ సంస్థ చేసిన కొత్త పరిశోధనను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్…