Omicron subvariant BF.7 detected in India : చైనాలో కోవిడ్ -19 విజృంభనకు కారణం అవుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా భారత్ లో మూడు బీఫ్.7 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్.7 వేరియంట్ కేసులను బుధవారం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి బీఎఫ్.7 కేసును అక్టోబర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. చైనాలో తీవ్రమైన కోవిడ్ కేసులకు ఈ ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణం అవుతోంది.
Amruta Fadnavis termed Prime Minister Narendra Modi as Father of Nation: భారతదేశానికి ఇద్దరు ‘జాతిపిత’ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. ప్రధాని నరేంద్రమోదీని ‘ఫాదర్ ఆఫ్ నేషన్’గా అభివర్ణించారు. ఈ వారం నాగ్‌పూర్‌లో రచయితల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మహాత్మాగాంధీ ఏమవుతారని ప్రశ్నించగా.. మహాత్మాగాంధీ ‘జాతిపిత’ అని.. ప్రధాని నరేంద్ర మోదీ నవ భారదేశానికి జాతిపిత అంటూ…
15 students feared dead in road accident in Manipur: మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కు వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించారు. ఈ ఘటన బుధవారం నోనీ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఖౌపుమ్ ప్రాంతంలో హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు…
3 Waves For About 3 Months, Covid Expert On China: కోవిడ్ మహమ్మారికి జన్మస్థానం అయిన చైనా, కోవిడ్ బారిన పడి అల్లాడుతోంది. గతంలో కొన్ని కేసుల సంఖ్య వేలకు చేరేందుకు కొన్ని రోజలు పడితే.. ప్రస్తుతం అక్కడ గంటల్లోనే వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేయడంతో చైనా వ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా సిబ్బంది కరువయ్యారు. రాబోయే మూడు నెలల్లో చైనా…
Postpone Bharat Jodo Yatra, Health minister writes to Rahul Gandhi: చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. కోవిడ్ తో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతలా అంటే అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా సిబ్బంది దొరకడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో కీలక నగరం షాంఘైలో కేసులు ఇబ్బదిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.
The central government has organized a key meeting on Covid-19: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్-19 ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే చైనాతో పాటు పలు దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా చైనాలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా కోవిడ్ పరిణామాలపై భారతదేశం కూడా అప్రమత్తం అయింది.
Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అడ్డంకిగా మారిందని…
Passenger finds cockroach in omlette served on Rajdhani Express: రైల్వేను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే కొన్నిసార్లు సిబ్బంది అలసత్వం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఓ ప్రయాణికులు ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్ధింక దర్శనం ఇచ్చింది. ఈ పరిణామంతో కంగుతిన్న ప్రయాణికుడు భోజనాన్ని ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇండియన్ రైల్వేస్, కన్జూమర్ ఎఫైర్, ఫుడ్, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను ట్యాగ్ చేశారు.
End Of The Earth: విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, మరణం అనేది ఉంటుంది. ఏదో రోజు మన సౌరవ్యవస్థకు మూలం అయిన సూర్యుడు కూడా చనిపోతాడు. అయితే దీనికి కొన్ని బిలియన్ ఏళ్ల సమయం పడుతుంది. అయితే ఆ సమయంతో భూమి కూడా అంతం అవుతుంది. అయితే చివరి రోజుల్లో భూమి అంతం ఎంతటి దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు అంచానా వేస్తున్నారు. అయితే అందుకు ఓ ఉదాహరణ లభించింది.
Ashok Gehlot Slashes LPG Cylinder Prices To Less Than Half In Rajasthan: ఎన్నికలు దగ్గర పడుతున్న రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నేరుగా అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. దేశవ్యాప్తంగా రాజస్థాన్, ఇటీవల గెలిచిన హిమాచల్ ప్రదేశ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. రాజస్థాన్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.