Farooq Abdullah on Pathaan controversy: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’మూవీ వివాదాస్పదం అయింది. ఈ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాటు ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణె కాషాయరంగు బికినీలో కనిపించడంతో పాటు పాటలో అసభ్యత ఎక్కువగా ఉండటంతో హిందూ సంస్థలు, బీజేపీ పార్టీ ఈ పాటను తొలగించాలని లేకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ముస్లిం సంఘాలు కూడా ఈ పాటపై అభ్యంతరం తెలుపుతున్నాయి.
3 dead after shooting in central Paris, gunman arrested: ఫ్రాన్స్ రాజధాని పారిస్ గన్ కాల్పులతో దద్దరిల్లింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్ నగరం కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శుక్రవారం సెంట్రల్ ప్యారిస్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గన్ తో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
2 Naxals killed in encounter with security forces on Maharashtra-Chhattisgarh border: మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్టుతో పాటు ఇద్దరు నక్సల్స్ మరణించారు. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో మరికొంత మంది నక్సలైట్లు అడవిలోకి పారిపోయినట్లుగా పోలీస్…
BRS Kisan Cell President Gurnam Singh Comments: దేశంలో పెద్ద మార్పు రావాలని, పేదలు,రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు లేవని అన్నారు భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు,పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు,రైతు భీమా సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని.. తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాలు యావత్ […]
Kamal Haasan Likely To Join Rahul Gandhi's Bhrat jodo Yatra In Delhi Tomorrow: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో సాగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ప్రస్తుతం హర్యానాకు చేరింది.
China reports 37 million Covid cases in a day: కరోనాకు జన్మస్థానం అయిన చైనాను ఉప్పెనలా కమ్మెస్తోంది మహమ్మారి. ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఏ దేశం చూడని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు విదేశీ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలపై చైనా స్పష్టత ఇవ్వడం లేదు. జీరో కోవిడ్ ఎత్తేసిన…
Difficult to say real form of Ram Setu is present, says Union Minister Jitendra Singh: చాలా ఏళ్లుగా ‘రామసేతు’పై చర్చ నడుస్తూనే ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ గా పిలవబడే ఈ నిర్మాణమే రామాయణ కాలంలో శ్రీరాముడు లంకకు నిర్మించిన వారధి అని చాలా మంది హిందువులు భావిస్తుంటారు. తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు ఈ బ్రిడ్జ్ ఉంది. ఇది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా ఉంది. అయితే ఈ అంశం తాజాగా జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో…
Gujarat Man Falls To Death From US Border: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుడు ప్రమాదవశాత్తు మరణించాడు. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకా నివాసి అయిన బ్రిజ్ కుమార్ యాదవ్ మెక్సికో-అమెరికా సరిహద్దు దాటుతూ మరణించినట్లు అమెరికన్ మీడియా వార్త కథనాలను ప్రచురించింది. ‘ట్రంప్ వాల్’గా పిలువబడే భారీ గోడ అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉంది. ఈ గోడను దాటి బ్రిజ్ కుమార్ కుటుంబం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసింది. గోడను ఎక్కుతున్న క్రమంలో బ్రిజ్ కుమార్…
Bajrang Dal wants ban on New Year parties in Mangaluru: హిందూ సంస్థ భజరంగ్ దళ్ న్యూఇయర్ పార్టీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం మంగళూర్ నగరంలో న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలని కోరుతోంది. ఇందు కోసం భజరంగ్ దళ్ మంగళూర్ పోలీస్ కమిషనర్‌కు ఒక మొమోరాండం కూడా సమర్పించింది. ముస్లిం యువకులు ‘‘ లవ్ జిహాద్’’ కోసం బార్లు, పబ్బులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. దీంతో మంగళూర్ వ్యాప్తంగా న్యూఇయర్ పార్టీలను నిషేధించాలని కోరింది. కొత్త సంవత్సరం…
Man Kills Mother, Neighbours After Fight Over "Going Out Naked": జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. నగ్నంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొడుకును వారించింది తల్లి. దీంతో తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. అడ్డుగా వచ్చిన చుట్టుపక్కల వారిపై దాడి చేసి మరో ఇద్దరిని చంపేశాడు. నిందితుడు మానసిక వికలాంగుడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.