Devendra Fadnavis announces SIT probe into Disha Salian's death: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కేసు ఇప్పటికే ముంబై పోలీసుల పరిధిలో ఉందని.. దీనిపై సిట్ ద్వారా విచారణ జరపుతాం అని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ హత్యపై ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందించవచ్చని తెలిపారు. ఎవరినీ…
Ali Ahmed Aslam, 'Chicken Tikka Masala' Inventor, Dies At 77: చికెన్ టిక్కా మసాలా ప్రత్యేకం పరిచయం అక్కర లేని వంటకం. చాలా మందికి ఇష్టం. దేశంతో పాటు ప్రపంచంలో అన్ని రెస్టారెంట్ మెనూల్లో ఈ వంటకం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ వంటాకాన్ని మొదటిసారిగా సృష్టించిన వ్యక్తి ఫేమస్ చెఫ్ అహ్మద్ అస్లాం అలీ కన్నుమూశారు. ఈ ఐకానిక్ డిష్ ని 1970లో కనుక్కున్నారు. 77 ఏళ్ల వయసులో యూకేలోని గ్లాస్గోలో ఆయన బుధవారం మరణించారు.
No Decision Yet To Stop Flights From China, Says Centre: కరోనా మహమ్మారికి జన్మస్థలం అయిన చైనా ఎప్పుడూ లేని విధంగా మహమ్మారి బారినపడి అల్లాడుతోంది. గతంలో రోజుల వ్యవధిలో అక్కడ వేల కేసులు నమోదు అయితే.. ప్రస్తుతం గంటల్లోనే వేల కేసులు నమోదు అవుతున్నాయి. చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగింది. శ్మశాన వాటికల్లో పనిచేసేందుకు సిబ్బంది కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ‘జీరో కోవిడ్’ విధానాన్ని చైనా ఎత్తేయడంతో అక్కడ కేసుల సంఖ్య అదుపుతప్పింది. అత్యంత వేగంగా ఇన్ఫెక్షన్ కు…
Amid Covid Concerns, No Entry For Tourists In Taj Mahal Without Testing: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 విస్తరిస్తోంది. కరోనా ప్రారంభం అయిన గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో చైనాలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లో మూడు కరోనా వేవ్ లు చైనాను దెబ్బకొడతాయని అంచనా వేస్తున్నారు.
Serial Killer Charles Sobhraj To Be Released From Nepal Jail: చార్లెస్ శోభరాజ్ నేరచరిత్రలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 1970లలో ఆసియా మొత్తం వరసగా హత్యలు చేసి ప్రపంచాన్ని గడగడలాడించారు. ఫ్రెంచ్ జాతీయుడైన శోభరాజ్ చిన్నతనం నుంచే నేరాలను ప్రారంభించి పలుమార్లు జైలు శిక్షను అనుభవించాడు. అయితే 2003లో ఇద్దరు అమెరికన్లను నేపాల్ లో హత్య చేశాడు శోభరాజ్. ఈ కేసులో నేపాల్ న్యాయస్థానం శిక్ష విధించింది. తాజాగా అతని వయస్సు దృష్ట్యా అతన్ని విడుదల చేయాలని…
Son beats mother with stick for not giving him money for smartphone: మానవ మనుగడను మొబైల్ విప్లవం బాగా మార్చేంది. అరచేతిలోకి ప్రపంచం వచ్చింది. ఇంటి నుంచే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అయితే దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే మరింతగా మానవ జీవితం మారుతుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లే పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో పరిచయం అయ్యే వారితో సంబంధాలను నెరుపుతూ భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లకు బానిసలుగా…
Russia's Zircon Hypersonic Missile: ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు తన దేశం సర్వనాశనం అవుతున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ యుద్ధాన్ని ఆపి, రష్యాతో చర్చలకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. మరన్ని ఆయుధాలు కావాలంటూ అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా అమ్ముల పొదిలో అధునాతన క్షిపణి చేరినట్లు వెల్లడించారు. దీనికి ప్రపంచంలో సాటి లేదని ఆయన అన్నారు.
Omicron Subvariant BF.7 Symptoms: చైనాలో అల్లకల్లోలానికి దారి తీస్తోంది ఓమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. జీరో కోవిడ్ విధానాన్ని కూడా చైనా ప్రభుత్వం ఎత్తేయడంతో రానున్న మూడు నెలల్లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని.. జనాభాలో 60 శాతం మంది కోవిడ్ బారిన పడతారని పరిశోధకులు చెబుతున్నారు.
Russia Says No Chance Of Peace Talks As Zelenskiy Travels To Washington: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ బుధవారం అమెరికాలో పర్యటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కావడంతో పాటు కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే జెలన్ స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. బుధవారం జెలన్ స్కీ వాషింగ్టన్ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఉక్రెయిన్ తో ఇక శాంతి చర్చలకు అవకాశం…
Sanjay Raut comments on Karnataka-Maharashtra border dispute: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చరాజేస్తోంది. బెలగావి ఈ మొత్తం సమస్యకు కేంద్రం అవుతోంది. గత కొన్ని దశాబ్ధాలుగా కర్ణాటకలోని బెలగావి తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి చైనా ప్రవేశించినట్లే.. కర్ణాటకలోకి మేం అడుగుపెడతాం అంటూ సరికొత్త వివాదానికి తెర లేపారు. ఈ విషయంలో…