Suicide blast in Pakistan’s Islamabad: దాయాది దేశం పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని ఇస్లామాబాద్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇస్లామాబాద్ లోని అత్యంత కట్టుదిట్టమైన, దేశ పార్లమెంట్, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వెళ్లే దారిలో ఈ ఘటనల జరగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. పేలుడు సంభవించిన వెంటనే ఉగ్రవాద వ్యతిరేక దళం ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ పేలుడులో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా.. నలుగురు పోలీసులు గాయపడ్డారు. మరణించిన పోలీస్ అధికారిని అదీల్ హెస్సేన్ గా గుర్తించారు.
Read Also: Earth Sagged : గోషామహల్‌లో కుంగిన పెద్ద నాలా.. పడిపోయిన దుకాణాలు, కార్లు
ఈ పేలుడుపై పాకిస్తాన్ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ ప్రారంభించాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీస్ అధికారులు అనుమానాస్పదంగా ఉన్న ఓ కారును వెంబడించారు. కారులో ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. అయితే అయితే పోలీసుల కారు ఆపడంతో కారులోంచి జంట దిగింది. కారును తనిఖీ చేస్తున్న సమయంలోొ సదరు వ్యక్తి మళ్లీ కారులోకి వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. అయితే నిందితులు అనుకున్న పథకాన్ని అమలు చేస్తే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
https://twitter.com/IslamabadViews/status/1606175642499809280
బాంబు పేలుడుతో రాజధాని ఇస్లామాబాద్లో హైఅలర్ట్ ప్రకటించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పాక్ మంత్రి అభిప్రాయపడ్డారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జైలులోకి చొరబడిన 25 మంది తాలిబాన్ ఉగ్రవాదులను పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ చేసి హతమార్చింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఆత్మాహుతి దాడి జరిగింది.