Sharad Pawar: దేశంలో మార్పు పవనాలు బలంగా వీస్తున్నాయని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన కంచుకోట అయిన కస్బాపేత్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. దీనిపై మాట్లాడుతూ శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కస్బా పేత్ ఓటమితో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని స్పష్టమైందని ఆయన అన్నారు. దాదాపుగా మూడు దశాబ్ధాలుగా పూణేలోని ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది.
Russia Might Run Out Of Money: స్నేహపూర్వక దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే వచ్చే ఏడాది రష్యా దగ్గర డబ్బు లేకుండా పోతుందని, రష్యా ఖజానా ఖాళీ అవుతుందని రష్యాలో పవర్ ఫుల్ వర్గం రష్యన్ ఒలిగార్చ్ హెచ్చరించారు. సైబీరియాలో జరిగిన ఆర్థిక సదస్సులో రష్యన్ ఒలీగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో మాస్కో యుద్ధాన్ని ముగించాలని బిలియనీర్లు పిలుపునిచ్చారు. పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉందని అన్నారు. రష్యా…
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురు అయింది. రోస్ ఎవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానం మరో రెండు రోజుల పాటు సిసోడియా కస్టడీని పొడగించింది. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరడంతో మార్చి 6 వరకు కస్టడీని పొడగించారు. సీబీఐ మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు 2 రోజుల కస్టడీ మాత్రమే పొడగించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ ను ఈ నెల…
Russian scientist Andrey Botikov: ప్రపంచంలో మొదటి కోవిడ్ వ్యాక్సిన్, రష్యా తయారీ స్పుత్నిక్ వీని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ గురువారం మాస్కోలోని తన అపార్ట్మెంట్ లో శవమై కనిపించారు. బెల్టుతో గొంతును బిగించి హత్య చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
BJP's Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది,
Influenza: భారతదేశ వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి దీర్ఘకాలిక దగ్గుతో పాటు కోవిడ్ లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. రెండు ఏళ్లుగా కోవిడ్ తో బాధపడిన ప్రజలు ఇప్పుడు పెరుగుతన్న ఫ్లూతో భయపడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా-ఎ సబ్టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
Sikh Brothers Separated During Partition, Reunite After 75 Years: 1947 భారత్ - పాకిస్తాన్ దేశవిభజన ఎన్నో చేదు గుర్తలను మిగిల్చింది. వేల సంఖ్యలో హిందూ, ముస్లిం, సిక్కులు ఊచకోతకు గురయ్యారు. చాలా కుటుంబాలను విభజన చిన్నాభిన్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని దశాబ్ధాల తర్వాత అన్నదమ్ములు, అన్నా చెల్లిళ్లు, వారి కుటుంబాలు కలుసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు 75 ఏళ్ల తరువాత…
Karnataka: కర్ణాటక రాష్ట్రీయ హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రధాని నరేంద్రమోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రధాని పేరు లేకుండా ఫోటోలు ఉపయోగించకుండా ఓట్లు దండుకోవాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
UP Assembly turns into courtroom: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 58 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ కోర్టుగా మారింది. కోర్టుగా మారడమే కాదు ఏకంగా ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష విధించింది. దాదాపుగా రెండు దశాబ్ధాల కాలం ముందు బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు
Amit Shah criticizes Congress: ‘‘ మోదీ చనిపోవాలి’’, ‘‘ మోదీ సమాధిని తవ్వుతాం’’ అంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని, అయితే ఇవన్నీ పనిచేయవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన దీర్ఘాయువుతో ఉండాలని 130 కోట్ల మంది ప్రార్థిస్తున్నారని అన్నారు.