Karnataka: కర్ణాటక రాష్ట్రీయ హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రధాని నరేంద్రమోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రధాని పేరు లేకుండా ఫోటోలు ఉపయోగించకుండా ఓట్లు దండుకోవాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
Read Also: Uttar Pradesh: కోర్టుగా మారిన యూపీ అసెంబ్లీ.. ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష
ఈ సారి మోదీ పేరు వాడకుండా ఓట్లు అడగాలని, కరపత్రాలు, బ్యానర్లలో మోదీ ఫోటోలు ఉండొద్దని, అభివృద్ధి చేశామని, గోవులను సంరక్షించామని, హిందుత్వం కోసం పనిచేశామని ఓటర్లకు చెప్పండని అన్నారు. ఎంతో కష్టపడ్డామన్న గర్వంతో ఓట్లు అడిగే ప్రయత్నం చేయాలని ప్రమోద్ ముతాలిక్ అన్నారు.
భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేయవద్దని ప్రజలను ఆయన కోరారు. కాషాయ పార్టీకి మోదీ పేరు పెట్టడం మాత్రమే తెలుసని ఆరోపించారు. వారు మోదీ పేరు ఉపయోగించకుండా ఓట్లను అడగలేరని, మోదీ పేరుతో ఓట్లు ఆడిగే బీజేపీ నాయకులను చెప్పుతో కొట్టండి అని, వారు పనికిరాని వారని అన్నారు. పనికిరాని వారే మోదీ పేరును ఉపయోగించుకుంటారని, వారు వారి కార్యకర్తల సమస్యలను అర్థం చేసుకోలేరని ప్రమోద్ ముతాలిక్ అన్నారు.