Dimon Pawan: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ప్రారంభం అయ్యింది. ఈ సీజన్‌లో టాప్ 5 ఆటగాళ్లుగా నిలిచిన వారిలో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. తనూజ, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ ఈ సీజన్‌లో టాప్-5లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ 5 ఆటగాళ్ల నుంచి సంజన గల్రానీ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. ఆమె తర్వాత ఇమ్మాన్యుయేల్ హౌజ్ నుంచి బయటికి వచ్చాడు. ఇమ్మాన్యుయేల్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి డిమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు.
గ్రాండ్ ఫినాలేకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్ర నుంచి రవితేజ, డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్ వచ్చి సందడి చేశారు. బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఇమ్మాన్యుయేల్ తర్వాత డిమోన్ పవన్ డబ్బులతో బయటకు వచ్చాడు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున రవితేజకు ఒక బాధ్యత అప్పగించారు. ఆయన రవితేజకు సిల్వర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి హౌస్‌లోకి పంపారు. టాప్ 3 ఆటగాళ్లతో మాట్లాడి వారిని డబ్బులు తీసుకునేలా ఒకరిని ఒప్పించాలని, లేదంటే ఎలిమినేట్ అయిన వ్యక్తిని బయటకు హౌజ్ నుంచి తీసుకురావాలని చెప్పారు. నాగ్ చెప్పినట్లుగా హౌజ్‌లోకి వెళ్లిన మాస్ మహారాజా కళ్యాణ్, తనూజ, డిమోన్ పవన్‌లతో మాట్లాడాడు. ముందుగా రూ.5లక్షలతో మొదలు పెట్టి రూ.15 లక్షల వరకూ ఆఫర్‌ను పెంచుకుంటూ వెళ్లారు. ఈ ఆఫర్‌ను పవన్ సద్వినియోగం చేసుకుంటూ రూ.15లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. నిజానికి ప్రేక్షకులు వేసిన ఓట్లలోనూ పవన్ మూడో స్థానంలో ఉండటంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. బిగ్ బాస్ హౌజ్ నుంచి పవన్ రూ.15 లక్షలతో బయటికి రావడంతో ఈ సీజన్ విన్నర్‌కు రూ.35లక్షలు మాత్రమే ప్రైజ్ మనీ వస్తాయని హోస్ట్ నాగార్జున వెల్లడించారు.
READ ALSO: ట్రెడిషనల్ చీరలో మోడర్న్ గ్లామర్.. అనసూయ స్టన్నింగ్ లుక్స్ వైరల్!