BJP: పాకిస్తాన్ కూడా చేయలేని ఆరోపణలను రాహుల్ గాంధీ దేశంపై చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP’s Fresh Attack on Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశం పరువును తీస్తున్నారని మండిపడుతోంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). ప్రపంచ దేశాలు భారత్ ను పొగుడుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం విమర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేసేందుకు భయపడుతోంది, కానీ రాహుల్ గాంధీ మాత్రం విదేశీ గడ్డపై దేశంలో ప్రజాస్వామ్యం లేదని, న్యాయవ్యవస్థ, మీడియా ప్రమాదంలో ఉందని ఆరోపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్న తరుణంలో ఇక్కడ వ్యాపారం చేసేందుకు చైనాను విడిచిపెడుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Influenza: కోవిడ్ తరహాలో ఫ్లూ.. ఇండియా వ్యాప్తంగా పెరిగిన కేసులు.. లక్షణాలు ఇవే..
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు రాహుల్ గాంధీ ఏజెంట్ గా పనిచేస్తున్నారా..? అని ప్రశ్నిస్తుంచారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ.. భారత దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, తనతో పాటు పలువురు రాజకీయ నాయకులు నిఘాలో ఉన్నారని రాహుల్ ఆరోపించారు. మైనారిటీలను దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని.. ఆయన, గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేయడానికి ఎందాకైనా వెళ్తారని సంబిత్ పాత్ర ఆరోపించారు. రాహుల్ గాంధీ తన ప్రభ కోల్పోతున్నారని, అందుకే భారతదేశం గొప్పతనం అర్ధం కాదని అన్నారు.
పెగాసస్ మాల్వేర్ ద్వారా నిఘా పెడుతున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీకి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎందుకు మొబైల్స్ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. చైనాలో ఎల్లో రివర్ జాతీయవాదానికి కారణం అయిందని చెబుతున్న రాహుల్ గాంధీకి, భారత్ లోని గంగా నదీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!