Russian scientist Andrey Botikov: ప్రపంచంలో మొదటి కోవిడ్ వ్యాక్సిన్, రష్యా తయారీ స్పుత్నిక్- Vని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ గురువారం మాస్కోలోని తన అపార్ట్మెంట్ లో శవమై కనిపించారు. బెల్టుతో గొంతును బిగించి హత్య చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. బోటికోవ్(47) గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. బోటికోవ్ మృతదేహం దొరికిన కొన్ని గంటల తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది.
Read Also: BJP: పాకిస్తాన్ కూడా చేయలేని ఆరోపణలను రాహుల్ గాంధీ దేశంపై చేస్తున్నారు.
29 ఏళ్ల యువకుడు బోటికోవ్ తో తీవ్రవాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ సమయంలో బోటికోవ్ ను బెల్టుతో ఉరివేసి హత్య చేశాడు. శాస్త్రవేత్త మరణాన్ని పరిశోధిస్తున్నట్లు అక్కడి దర్యాప్తు సంస్థలు తెలిపాయి. హత్య జరిగిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. హత్య చేసిన వ్యక్తిని తక్కువ సమయంలోనే పట్టుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు నేరచిరిత్రను కలిగి ఉన్నట్లు తేలింది.
2021లో కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి చేసిన కృషికి గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బోటికోవ్ కు ‘‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ఫాదర్ ల్యాండ్’’ అవార్డును ఇచ్చాడు. 2020లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తలో బోటికోవ్ ఒకరు.