India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
Antony Blinken: ఇండియా ఈ ఏడాది జీ20 సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి. దీంతో పాటు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ‘క్వాడ్’ సమావేశం కూడా శుక్రవారం జరిగింది. కాగా ఢిల్లీలో జరగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. తాను ఆటోలో వచ్చిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
S Jaishankar Explains How Government Functions Under "Captain Modi": భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పనితనంలో ది బెస్ట్ ఫారన్ మినిస్టర్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి వేదికైనా, ఏ దేశం అయినా భారత్ విషయంలో ప్రశ్నిస్తే ధీటుగా సమాధానం ఇస్తున్నారు. భారత విదేశాంగ విధానంలో సమర్థవంతమైన మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మరింతగా పెంచారు. జైశంకర్ ను ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే ఎవరైనా ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అలాంటి వాక్చాతుర్యం ఆయన…
Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాను సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసింది. ఈ చర్యను ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఖండిస్తోంది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఒత్తడి వల్లే సీబీఐ తప్పుడు అభియోగాలతో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిందని ఆప్ నేతలు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆప్ , ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో పిల్లలతో మనీష్ సిసోడియాకు మద్దతు తెలిపే ప్లాన్ కు శ్రీకారం…
Uzbekistan Child Deaths: గతేడాది భారతీయ తయారీ దగ్గుమందు వల్ల ఉజ్బెకిస్థాన్ దేశంలో 18 మంది పిల్లలు మరణించారు. ఢిల్లీకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగానే పిల్లలు మరణించినట్లు ఉబ్జెకిస్థాన్ ఆరోపించింది
Russia-Ukraine War: ఏడాది గడిచినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం శీతాకాలం ముగియడంతో ఉక్రెయిన్ పై రష్యా మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తోంది. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని రష్యా చరిత్రలో మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ పై మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. రానున్న మూడు నెలల పాటు ఉక్రెయిన్లపై ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Rahul Gandhi at Cambridge: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. తాను భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ లో పర్యటించినప్పుడు జరిగిన ఓ సంఘటనను అక్కడ ఉన్నవారితో పంచుకున్నారు. ఉగ్రవాద ప్రభావం ఉండటం వల్ల కాశ్మీర్ లో యాత్ర చేయొద్దని భద్రతా బలగాలు తనను కోరాయని, అయితే తాను మాత్రం యాత్రను కొనసాగించేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు.
Man lost in Amazon jungle for 31 days: ప్రపంచంలోనే అతిపెద్ద దట్టమైన అడవి అమెజాన్. దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ పాటు చుట్టుపక్కల దేశాల్లో విస్తరించి ఉన్న మహారణ్యం. ఇక్కడ తప్పిపోవడం అంటే చావుతో సమానమే. ఎటువెళ్లాలో తెలియదు, ఎటుచూసినా కనుచూపు మేరలో చెట్లు తప్పితే ఇంకేం కనిపించవు. ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండలు, చిరుతపులులు, మొసళ్లకు, విష కీటకాలకు అమెజాన్ అడవి ప్రసిద్ధి. ఇలాంటి సమయంలో వాటి నుంచి తప్పించుకుని బతికిబట్టకట్టడం అంటే అదృష్టమని చెప్పవచ్చు.
iPhone-Foxconn: ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
Anurag Thakur criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘాలో ఉన్నానని యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. అనురాగ్ ఠాకూర్, రాహుల్ గాంధీ విమర్శలను శుక్రవారం తప్పుపట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విదేశీ గడ్డపై భారతదేశాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.