Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యూకేలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే లండన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీని గుడ్డిగా విశ్వసించే ఎవరికైనా మద్దతు ఉంటుందని, మోదీపై, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే వారిపై దాడులు జరుగుతున్నాయని, బీబీసీపై ఇదే విధంగా దాడి జరిగిందని ఆయన అన్నారు.
Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా కేంద్ర ప్రకటిస్తుందని, గోవధను నిషేధిస్తుందని అలహాబాద్ హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ మతంలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఉందని కోర్టు విశ్వసిస్తోందని పేర్కొంది. మనం లౌకిక దేశంలో జీవిస్తున్నామని, అన్ని మతాలను గౌరవించాలని, హిందూ మతంలో ఆవును దైవంగాీ భావిస్తారని, కాబట్టి ఆవును రక్షించాలి, పూజించాలని జస్టిస్ షమీమ్ అహ్మద్ ఫిబ్రవరి 14న వ్యాఖ్యానించారు.
Law Minister Kiren Rijiju: భారత న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నాయని ప్రపంచానికి తప్పుగా చాటి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరన్ రిజిజు అన్నారు. శనివారం తూర్పు రాష్ట్రాల్లోని కేంద్ర న్యాయవాదుల సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల విజ్ఞత ప్రజల పరిశీలనకు మించినదని ఆయన అన్నారు. భారత న్యాయవ్యవస్థను ప్రశ్నించలేమని, ముఖ్యంగా న్యాయమూర్తుల విజ్ఞతను ప్రజల పరిశీలనలో ఉంచలేమని వ్యాఖ్యానించారు.
cultivate ganja using LED lights: సాధారణంగా ఏ మొక్క అయిన సూర్యకాంతి సహాయంతో పెరుగుతుంది. కానీ ఈ కేటుగాళ్లు మాత్రం ఏకంగా గంజాయిని ఎల్ఈడీ లైట్ల సాయంతో పెంచారు. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. నలుగురు వ్యక్తులు అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఏకంగా కృత్రిమంగా గంజాయిని సాగు చేశారు. సహజ సూర్యకాంతిని ఎల్ఈడీ లైట్లలో భర్తీ చేశారు. దీన్ని పెంచడానికి ప్రత్యేకంగా ఓ ఎయిర్ కండీషనర్ ను వాతావరణ నియంత్రణ కోసం ఉపయోగించారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ సెటప్…
World's First Bamboo Crash Barrier : సాధారణంగా రోడ్ల వెంట ఉక్కు బారియర్లు కనిపిస్తుంటాయి. కానీ ప్రపంచంలో తొలసారిగా రోడ్డుకు ఇరువైపు వెదురు క్రాష్ బారియర్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, యావత్మాల్ జిల్లాల్లోని వాణి-వరోరా జాతీయ రహదారిపై వీటిని ఏర్పాటు చేశారు.
Hindu Temple Attack: ఖలిస్తానీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఓ పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఇండియాలో అశాంతిని చెలరేగేలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, యూకే దేశాల్లో పలు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలను రాస్తున్నారు.
Best-selling cars in February: కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది. ఫిబ్రవరిలో అమ్ముడైన టాప్ -10 కార్లలో 7 మారుతి మోడల్ కార్లే ఉండటం గమనార్హం. భారత ప్రజలు ఎక్కువగా హ్యాచ్ బ్యాక్ కార్ల కొనుగోలుకే మొగ్గు చూపినట్లు అమ్మకాలను బట్టి చూస్తే తెలుస్తోంది.
పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
Vada Pav Best Sandwiches In The World: ‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ నెమ్మనెమ్మదిగా ఇండియా మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఫుడ్ లవర్స్ ను కూడా మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వడాపావ్ అంతర్జాతీయ గుర్తింపును పొందింది. దీనికి అరుదైన గుర్తింపు లభించింది.
Kapil Sibal: ప్రముఖ న్యాయవాది, మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ బీజేపీపై పోరాటానికి సిద్ధం అయ్యారు. దీని కోసం కొత్త వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్’ అనే వేదికను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ‘ఇన్సాఫ్ కే సిపాహి’ పేరిట వెబ్ సైట్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలపై లాయర్లు పోరాటా చేస్తారని అన్నారు. దీనికి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.