Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురు అయింది. రోస్ ఎవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానం మరో రెండు రోజుల పాటు సిసోడియా కస్టడీని పొడగించింది. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరడంతో మార్చి 6 వరకు కస్టడీని పొడగించారు. సీబీఐ మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు 2 రోజుల కస్టడీ మాత్రమే పొడగించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ ను ఈ నెల 10న కోర్టు విచారించనుంది.
Read Also: Manik Rao Thackeray : తెలంగాణ కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతున్న మాణిక్ రావు ఠాక్రే
బెయిల్ పిటిషన్ పై సీబీఐని సమాధానం ఇవ్వాలని కోర్టు కోరింది. సిసోడియా భార్య అనారోగ్యంతో ఉన్నారని, రిమాండ్ పొడగింపుకు ఎలాంటి కారణం లేదని సిసోడియా తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ పొడగించాలన్ని సీబీఐ వాదనను సిసోడియా లాయర్ దయన్ కృష్ణన్ తోసిపుచ్చారు. సిసోడియా నుంచి మిస్ అయిన ఫైల్స్ ను కనుగొనడం కూడా రిమాండ్ పొడగింపుకు కారణం కాదని ఆయన కోర్టుకు వెల్లడించారు.
గత ఆదివారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సిసోడియాను విచారణకు పిలిచింది. 8 గంటల విచారణ అనంతరం ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియా కార్యాలయం నుంచి మిస్ అయిన ఫైళ్ల గురించి సీబీఐ ప్రశ్నించింది. అయితే వీటిపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ ను కోరింది.