Venu Goapl Reddy
Author- NTV Telugu-
Mahsa Amini: ఇరాన్ యువతి మహ్స అమినికి ఈయూ ప్రతిష్టాత్మక అవార్డ్..
గతేడాది ఖుర్దిష్ యువతి 22 ఏళ్ల మహ్స అమిని పోలీస్ కస్టడీలో మరణించింది. హిజాబ్ ధరించలేదనే ఆరోపణలపై అక్కడి మోరాలిటీ పోలీసులు మహ్సా అమినిని అరెస్ట్ చేసి, కొట్టారు. దీంతో ఆమె కస్టడీలోనే మరణించారు. ఆమె మరణంతో యావత్ ఇరాన్ ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్‌లోని అయతుల్లా అలీ ఖమేని ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంది. -
Ayodhya: అయోధ్య ఆలయంలో గొంతుకోసి నాగసాధువు హత్య..
Ayodhya: ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో నాగ సాధువును దారుణంగా గొంతు కోసి చంపారు. అయోద్యలోని హనుమాన్ గర్హి ఆలయ సముదాయంలో ఈ హత్య చోటు చేసుకుంది. గురువారం నాడు 44 ఏళ్ల నాగ సాధువు రామ్ సహరే దాస్ అనే వ్యక్తిని గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.బుధవారం సాయంత్రం మృతుడి శిష్యుడు దుర్బల్ దాస్ ఆశ్రయంలోకి వచ్చి చూడగా రామ్ సహరే దాస్ ప్రాణం పోయి కనిపించాడని పోలీసుల తెలిపారు. మృతుడి గొంతుపై లోతైన గాయాలు ఉన్నాయని పోలీసులు నిర్థారించారు. -
DK Shiva Kumar: డిప్యూటీ సీఎంకి హైకోర్టు షాక్.. సీబీఐ కేసుల కొట్టివేతకు తిరస్కరణ..
DK Shiva Kumar: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన డీకే శివకుమార్‌కి ఊహించని ఎదురుదెబ్బ తాకింది. ఆయన అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. -
Himanta Biswa Sarma: లవ్ జీహాద్, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేం..
లవ్ జిహాద్, మతమార్పిడి, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేమని, ఛత్తీస్‌గఢ్ లో గిరిజనులు క్రైస్తవ మతంలోకి మారడానికి ప్రతీ రోజూ ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తిన సందర్భంలో భూపేష్ బఘేల్ తనను తాను లౌకికవాదిగా చెప్పుకుంటారని హిమంత విమర్శించారు. -
Udaipur Tailor Murder Case: టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసు ప్రధాన నిందితుడికి అనారోగ్యం..ఆస్పత్రికి తరలింపు..
Udaipur Tailor Murder Case: గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ని ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలను నరికి చంపారు. షాపులో పనిచేసుకుంటున్న సమయంలో కస్టమర్లుగా వచ్చిన రియాజ్ అట్టారి, మహ్మద్ గౌస్ కత్తితో తలను నరికేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహ్మద్ ప్రవక్తపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. -
Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం.. భారత వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి..
Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో విమర్శించారు. పాలస్తీనాపై భారత్ అవలంభిస్తున్న వైఖరి తీవ్రంగా నిరాశపరించిందని అన్నారు. అమాయకులు, నిస్సహాయులైన మహిళలు, పిల్లలు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నప్పుడు బలమైన వైఖరి లేకుండా భారతదేశం ఎలా నిలబడగలదు..? ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారత ప్రభుత్వం వైఖరి తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. -
Dabur India: డాబర్ ఉత్పత్తులపై యూఎస్, కెనడాల్లో కేసులు.. క్యాన్సర్‌కి కారణమవుతున్నాయని ఆరోపణలు..
Dabur India: డాబర్ ఉత్పత్తులు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కస్టమర్లు అమెరికా, కెనడాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తుల వాడకం అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని ఆరోపిస్తూ కస్టమర్లు యూఎస్, కెనడాలో కేసులు వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం తెలిపింది. -
Nokia: నోకియాలో భారీ కుదుపు.. 14,000 ఉద్యోగుల లేఆఫ్..
Nokia: టెక్ రంగంలో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో మొదలైన ఈ తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు కంపెనీలు దశల వారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. -
Tata Motors: టాటా అంటే మామూలుగా ఉండదు.. సేప్టీలో ఈ రెండు కార్లకు పోటీనే లేదు..
Tata Motors: కార్ల సేఫ్టీ విషయానికి వస్తే టక్కున గుర్తు వచ్చే పేరు టాటా. అంతలా ఈ కార్లు సేఫ్టీ రేటింగ్స్ విషయంలో అత్యుత్తమ స్కోర్ సాధిస్తున్నాయి. దేశీయ దిగ్గజ కార్ మేకర్ అయిన టాటా తన కార్ల సేఫ్టీలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. చిన్న కార్ల నుంచి ఎస్యూవీ వరకు అదే ప్రమాణాలను పాటిస్తోంది. -
Joe Biden: ఆవేశంతో అమెరికా చేసిన తప్పుల్ని ఇజ్రాయిల్ చేయొద్దు..
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్‌కి అమెరికా మద్దతు తెలియజేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ రోజు ఆ దేశానికి వెళ్లారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరువురు నాయకుడు కొనసాగుతున్న యుద్ధం గురించి చర్చించారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా క్రూరంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!