ఒక ఫొటో ఇద్దరు కుబేరుల మధ్య వివాదానికి దారిసింది. అందులో ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కాగా.. ఇంకొకరు భారతీయ-అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా. ఒక తప్పుడు ఫొటో కారణంగా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగింది.
దేశీయ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్‌లో విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్ ఎయిర్‌కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానయాన సంస్థ గగనతలంలోకి వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంది.
కాంగ్రెస్ నేత, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై లండన్ ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదని వినేష్ ఫోగట్‌కు సూచించారు. అనర్హతకు గురైనందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీహార్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. గంగా తీరం వెంబడి ఉన్న దాదాపు 12 జిల్లాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో 13.5 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 376 గ్రామ పంచాయతీలు ప్రభావితమయ్యాయి. చాలా మంది నివాసితులు శిబిరాలకు తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటి యాజమాని కొడుకు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. అద్దె ఇంట్లో ఉంటున్న యువతి దృశ్యాలను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాపం పండి భండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు.
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ)కి చెందిన ప్రముఖ నాయకురాలు అమరసూర్య ఈ పదవిని చేపట్టిన 16వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. హరిణి అమరసూర్య ఎన్పీపీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు.
కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఆ బాలుడికి శాపమైంది. కొత్త మొబైల్ కొన్న ఆనందం ఎంతో సేపు లేకుండానే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్‌పూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డులు నమోదు చేశాయి.
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనుంది.
లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం 300 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 500 మందికి చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ గురి చూసి లక్ష్యాలను చేధించినట్లు సమాచారం.