Elon Musk: భారతీయ-అమెరికన్ బిలియనీర్‌కు ఎలాన్ మస్క్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..!
- ఇద్దరు కుబేరుల మధ్య వివాదానికి దారితీసిన ఫొటో
- క్షమాపణకు భారతీయ అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా డిమాండ్
- క్షమాపణ చెప్పిన అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక ఫొటో ఇద్దరు కుబేరుల మధ్య వివాదానికి దారిసింది. అందులో ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కాగా.. ఇంకొకరు భారతీయ-అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా. ఒక తప్పుడు ఫొటో కారణంగా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగింది. చివరికి క్షమాపణతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అసలు ఇద్దరి మధ్య గొడవకు ఫొటో ఎందుకు కారణమైంది. ఆ ఫొటో ఏంటి? క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో 86 ఏళ్ల నటి ర్యాంప్ వాక్..
Also Read
అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్‌లో ఒక చిత్రంతో కూడిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిపై ‘‘No PLEBS ALLOWED’’ అని రాసి ఉంది. దాని కిందనే ప్రాపర్టీ ఆఫ్ వినోద్ ఖోస్లా అని ఉంది. ఈ ఫొటోపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. పబ్లిక్ బీచ్‌లో కూడా వినోద్ ఖోస్లా తన సొంత ఆస్తిగా పేర్కొన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారి తీశాయి. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై వినోద్ ఖోస్లా తీవ్రంగా స్పందించారు. ఒక తప్పుడు చిత్రాన్ని పట్టుకుని వెనక ముందు చూసుకోకుండా విమర్శలు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఏఐ రూపొందించిన ఒక తప్పుడు చిత్రాన్ని పట్టుకుని విమర్శించడమేంటి? అని నిలదీశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని వినోద్ ఖోస్లా డిమాండ్ చేస్తూ రీ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: పద్మశ్రీ మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన ముఖ్యమంత్రి..
వినోద్ ఖోస్లా వివరణతో ఎలాన్ మస్క్ నాలుక కరుచుకున్నారు. తప్పు జరిగిపోయిందని భావించి.. ఎక్స్ ద్వారా ఎలాన్ మస్క్ క్షమాపణ తెలియజేశారు. దయచేసి తనను క్షమించాలని కోరారు.
ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. కమలా హారిస్‌కు వినోద్ ఖోస్లా మద్దతు తెల్పగా.. ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌ను మస్క్ చేసిన ఇంటర్వ్యూను వినోద్ ఖోస్లా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
You owe me an apology for spreading falsehoods. I think this post of yours needs a community comment for being a fraudulent photo. I have never put up this sign or anything even remotely like this. I presume it is AI generated but you can verify that. It will help X if we can… https://t.co/5PVE8uxDpH
— Vinod Khosla (@vkhosla) September 22, 2024
Sorry I made a sign about you restricting access to a public beach.
That was so extremely terrible.
Please forgive me 🙏
— Elon Musk (@elonmusk) September 22, 2024
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్‌కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్‌తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్‌ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!