Kolkata Messi Tour Chaos: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఏర్పడిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్ సీరియస్‌గా స్పందించారు. మెస్సీ టూర్ నిర్వహణలో లోపాలు తలెత్తిన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనలు, అభిమానుల ఆగ్రహం నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Roja vs TDP: మాజీ మంత్రి రోజాపై టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..
అయితే, ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. లియోనల్ మెస్సీ పర్యటనలో నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆమె స్వయంగా అంగీకరించింది. అభిమానుల నిరాశకు బెంగాల్ సర్కార్ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. జరిగిన అసౌకర్యానికి అభిమానులు క్షమించాలని కోరారు. అంతేకాదు, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించింది. మెస్సీ పర్యటన సమయంలో ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.