Venkatesh Birthday : వెంకీమామ పుట్టినరోజున అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘విక్టరీ’ వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో కీలక పాత్రలో కనిపించనున్నా విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్ దాదాపు అరగంట పాటు స్క్రీన్‌పై కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వెంకీ పాత్ర కూడా స్పెషల్‌గా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్ నెక్ట్స్ మూవీగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!
Also Read
అంటే ఈ ఏడాదిలోనే వెంకటేష్ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘ఆదర్శ కుటుంబం’ అనే రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ ప్రాజెక్టు తర్వాత కూడా వెంకీ తదుపరి సినిమాలపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్. కెరీర్ ప్రారంభించి దాదాపు నలభై సంవత్సరాలు గడిచినా, యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్న వెంకటేష్ మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ “పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన విక్టరీ @వెంకీమామ గారు” అంటూ పోస్ట్ చేశారు. అలాగే వెంకటేష్ నటిస్తున్న తాజా పాత్ర ‘మన శంకర వర ప్రసాద్’ను తమ కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా, “ఈ సంక్రాంతికి మెగాస్టార్‌తో కలిసి మీరు స్క్రీన్లను వెలిగించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు. ఈ ఆత్మీయ బర్త్‌డే విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అనిల్ రావిపూడి – వెంకటేష్‌ల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి చూపిస్తున్నాయి.
Happy birthday dearest Victory @VenkyMama garu & welcome to the family of #ManaShankaraVaraPrasadGaru 🎉❤️
Can't wait for you to light up the screens this Sankranti along with the Megastar @KChiruTweets garu 😍#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE.
Megastar @KChiruTweets… pic.twitter.com/8Gw9nKNCl3
— Anil Ravipudi (@AnilRavipudi) December 13, 2025
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!