New airlines: విమాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ
- విమాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ
- శంఖ్ ఎయిర్‌కు కేంద్ర విమానయాన మంత్రి శాఖ గ్రీన్‌సిగ్నల్
- ఉత్తర ప్రదేశ్ నుంచి సేవలు ప్రారంభించనున్న శంఖ్ ఎయిర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ఎంట్రీ ఇవ్వబోతుంది. భారత్‌లో విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్ ఎయిర్‌కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విమానయాన సంస్థ గగనతలంలోకి వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నట్లు శంఖ్ ఎయిర్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు డైరెక్ట్ సర్వీసులు తక్కువగా ఉన్న మార్గాల్లో సేవలు అందించనున్నట్లు తెలిపింది. ఎఫ్‌డీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: లడ్డూ కామెంట్స్ పై కార్తీ క్షమాపణలు.. స్పందించిన పవన్ కళ్యాణ్
Also Read
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
ఉత్తరప్రదేశ్ నుంచి శంఖ్ తన ఎయిర్‌లైన్ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. కొత్త తరం మోడల్ అయిన బోయింగ్ 737-800 NG విమానాలతో తన కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇంట్రాస్టేట్ మరియు ఇంటర్‌స్టేట్ విమానాలను అందించడం ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేయాలనుకుంటున్నట్లు ఎయిర్‌లైన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొన్ని డైరెక్ట్ ఫ్లయింగ్ ఆప్షన్‌లను అందించడంతో పాటు బలమైన డిమాండ్ ఉన్న ప్రాంతాలను కనెక్ట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం అని తెలిపింది.
ఇది కూడా చదవండి: Renukaswamy murder case: దర్శన్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి ఐటీ అధికారులు..
విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి లేఖలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డిఐ) మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కి సంబంధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని శంఖ్ ఎయిర్‌కు సూచించింది. ఎయిర్‌లైన్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేయబడింది. ఇది మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.
ఇది కూడా చదవండి: Mpox Clade 1b: ఇండియాలో తొలిసారిగా ప్రమాదకరమైన ఎంపాక్స్ వెరైటీ గుర్తింపు..
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!