సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. గుర్తింపు కోసమో.. లేదంటే ఇంకేదైనా గొప్ప కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బీహార్‌లో ఓ యువకుడు చేసిన స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
భూమ్మీద మనుషుని పోలిన మనుషులు అక్కడక్కడా ఉంటారంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. జార్ఖండ్‌లో మాత్రం ఒక ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సహజంగా కవల పిల్లలు ఒకేలా.. అచ్చు గుద్దినట్లుగా ఉంటారు. అలా కాకుండా ఒక వ్యక్తిని పోలిన వ్యక్తి ప్రత్యక్షమైతే ఆశ్చర్యంగా ఉండదా?. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆవిష్కృతమైం
రెస్టారెంట్, తినుబండారాల యజమానులు గుర్తింపును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఓ పాడుబడిన కారులో మృతదేహాలు లభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు కారణంగా గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 85, 372 మార్కు క్రాస్ చేయగా.. నిఫ్టీ 26, 200 మార్కు క్రాస్ చేసి ఆల్‌టైమ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. గత వారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడుగా పోతుంది. మొదట కమ్యూనికేషన్ వ్యవస్థపై దెబ్బకొట్టగా.. అటు తర్వాత రాకెట్లకు పని చెప్పింది. పేజర్లు, వాకీటాకీలు పేలి వందల మంది చనిపోయారు.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో జనాలకు చుక్కలు కనిపించాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలాహారిస్ దూసుకెళ్లిపోతున్నారు. తాజా సర్వేలో ఆమె ముందంజలో ఉన్నారు. డెమొక్రాట్ అభ్యర్థిగా కమలాహారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బరిలో ఉన్నారు. నవంబర్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా జరిగిన సర్వేలో ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి.
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బుధవారం నోటీసు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో బరువు కారణంగా అనర్హత వేటుపడింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా క్రీడల నుంచి రిటైర్మెంట్ కూడా ప్రకటించేసింది.