Hyderabad: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని ప్రొద్దుటూరుకి చెందిన చందన జ్యోతికు కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ కు మూడు నెలల క్రితం వివాహమైంది.. యశ్వంత్ ఓ ప్రైవేటు (medplus)లో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇరువురు కలిసి మూసాపేట్ లో నివాసం ఉంటున్నారు.. కొద్ది రోజుల నుంచి ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉండటంతో చందన జ్యోతి మనస్తాపానికి గురైంది. గత రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని చందన జ్యోతి ఆత్మహత్యకి పాల్పడింది.. భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేశాడు. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.
READ MORE: Roja vs TDP: మాజీ మంత్రి రోజాపై టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..