జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనుంది.
లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం 300 మంది చనిపోయినట్లు లెబనాన్ ప్రకటించగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 500 మందికి చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ గురి చూసి లక్ష్యాలను చేధించినట్లు సమాచారం.
పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి. గత వారం లెబనాన్‌లోని హిజ్బుల్లా నాయకుల లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది
అవయవ దానం చేయడం మంచిదే. అది ఎప్పుడు చేయాలి.. కోమాలో ఉన్నప్పుడో.. లేదంటే చనిపోయాక చేయడం మంచిదే. అంతేకాని చిన్న వయసులో.. పసి బిడ్డలు కలిగిన వారు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
కార్లలో అమర్చే సాఫ్ట్వేర్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్లలో చైనీస్ సాఫ్ట్‌వేర్‌ను నిషేధించాలని అమెరికా ప్రతిపాదించింది. జాతీయ భద్రతా సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనీస్ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్తో అనుసంధానించబడి ఉంటుంది.
పాకిస్థాన్ కొత్త ఐఎస్ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో అడ్జుటెంట్ జనరల్‌గా మాలిక్ పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత డీజీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. నదీమ్ పదవీకాలాన్ని పొడిగించలేదు.
ఓనం పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భోపాల్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో దారుణం జరిగింది. ఒక కెమిస్ట్రీ టీచర్.. బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదే పదే సాడొమైజ్ చేయమని బలవంతం చేశాడు. అభ్యంతరం చెప్పడంతో పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మొబైల్లో రికార్డ్ చేయమని బలవంతం చేశాడు. గతేడాది ఈ ఘటన చోటుచేసుకుంది.
పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. గత వారం లెబనాన్‌లోని హిజ్బుల్లా నాయకుల లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సోమవారం హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 300 రాకెట్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది.
విజయవాడలోని అశోక్‌నగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.