భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు ఎంఎస్.ధోనీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లెట్ బండి నడుపుతూ రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను చూసి ఆయన అభిమానులకు సంబర
జొమాటోతో ఉన్న 13 సంవత్సరాల అనుబంధాన్ని అక్రితి చోప్రా తెగతెంపులు చేసుకున్నారు. అక్రితి చోప్రా జొమాటో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఆమె జొమాటో సహ వ్యవస్థాపకురాలుగా కూడా ఉన్నారు. 13 సంవత్సరాల తర్వాత జొమాటోకు గుడ్‌బై చెప్పారు. సెప్టెంబర్ 27, 2024 నుంచి తన రిజైన్ అమలులోకి వస్తుందని అక్రితి పేర్కొన్నారు. సీఈవో దీపిందర్ గోయల్‌కి కృతజ్ఞతలు తెలుపారు
బీహార్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్లబ్‌గా మారిపోయింది. పాఠశాలను బార్గా మార్చేసి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో అశ్లీల డ్యాన్స్‌లు చేయిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు హమాస్, హిజ్బుల్లా మీద పోరాటం ఆగదని అంతర్జాతీయ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ సగం బలగాలను అంతం చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు.
బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుందర్ సింగ్ 115 ఓట్లు గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆప్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ రెండో వారంలో భారత్‌లో పర్యటిస్తున్నారు. మాల్దీవుల అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోడీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తమిళనాడు మెట్రో ప్రాజెక్ట్‌లకు అందించాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని.. తమిళనాడు నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా టార్గెట్‌గా లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తోంది. శత్రువులతో చేతులు కలిపే దేశాలపై ఇజ్రాయెల్ దూకుడుగా పోతోంది. ఇప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆయా దేశాలు తమ పౌరులు లెబనాన్‌ను విడిచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ముగింపులో మాత్రం సూచీలు నష్టాల్లో ముగిశాయి.