నాల్గవ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగ్గా 16.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ భారతదేశంలో నియామకాలను వేగవంతం చేయనుంది.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు మొహాలీ ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా ఆయనకు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌకర్యాలు ఎంత బాగుండాలి. అలాంటిది ఫ్లైట్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుడు భారత విమానాయాన శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
టెలికాంలో ఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా బీఎస్ఎన్ఎల్ ప్రతిభ ఎప్పుడూ మసకబారలేదు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ సంస్థ ఎప్పటికప్పుడూ దూకుడుగా వెళ్తూనే ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు పరుగులు పెడుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్‌కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది.
10 వేల నోట్లు మీరు ఎప్పుడైనా చూశారా? ఇండియాలో 10 వేల నోట్లు ఉండేవని కనీసం పెద్దలైనా ఎప్పుడైనా గుర్తుచేశారా? ఎవరు చెప్పలేదా? ఆ ఊసే ఎప్పుడు వినబడలేదా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఉగ్రవాదం మార్గదర్శకులకు సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి చెప్పామని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడో విడతలో జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్జికల్ స్టైక్స్‌తో శత్రుదేశాలకు భయం పుట్టించామని.. మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే దెబ్బలు తగులుతాయని అర్థం చేసుకున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
హర్యానా ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఎంఎస్పీ హామీ, కుల గణన వంటి వాగ్దానాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
నేటి యువతకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. నలుగురు చూస్తున్నారా? ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్‌గానే జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ జంట బైక్‌పై వెళ్తూ ముద్దుల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలా జంటలు ఈ మధ్య రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.
హిజ్బుల్లా అంతమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐకరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిజ్ఞ చేసిన కొన్ని నిమిషాలకే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై భీకరదాడులకు దిగింది. హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలు టార్గెట్‌గా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.