Delhi: ఆప్‌కు షాక్.. ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం
- ఢిల్లీలో ఆప్‌కు షాక్
- ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం
- బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుందర్ సింగ్ 115 ఓట్లు గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆప్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించారు. ఇక తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ సైతం ఓటింగ్‌కి దూరంగా ఉంది. దీంతో పోటీ లేకుండానే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: Maldives president: అక్టోబర్‌లో భారత్‌లో ముయిజ్జు పర్యటన.. ప్రధాని మోడీతో చర్చలు
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
బీజేపీ నేత కమల్‌జిత్ షెరావత్ వెస్ట్ ఢిల్లీ ఎంపీగా ఎన్నిక అయ్యారు. దీంతో ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుని పదవికి ఖాళీ ఏర్పడింది. గత గురువారం జరిగిన ఎంసీడీ సమావేశంలో ఎంసీడీ స్టాండిగ్ కమిటీ ఎన్నికను అక్టోబర్ 5వ తేదీకి మేయర్ షెల్లీ ఒబెరాయ్ వాయిదా వేశారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వాయిదాను తోసిపుచ్చుతూ శుక్రవారం ఒంటిగంటకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంసీడీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ గురువారం ఆర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఆరో సీటు ఎన్నికకు ప్రిసైడ్ చేయాలని అడిషనల్ మునిసిపల్ కమిషనర్ జితేంద్ర యాదవ్‌ను ఆదేశించారు. అయితే ఇంత స్వల్ప వ్యవధిలో ఎన్నికకు ఆదేశాలివ్వడం చట్టవిరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న ఎన్నికలు జరపాలని మేయర్ ఒబెరాయ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే ఎల్జీ ఆదేశాలకే కట్టుబడి స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికను కమిషనర్ చేపట్టడంతో ఓటింగ్‌కు ఆప్ కౌన్సిలర్లు దూరంగా ఉండిపోయారు. తాజా ఎన్నికతో ఎంసీడీలోని 18 మంది సభ్యుల స్టాడింగ్ కమిటిలో బీజేపీ బలం 10కి చేరింది. ఆప్‌కు 8 సీట్ల బలం ఉంది.
ఇది కూడా చదవండి: Monkeypox Case: భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు
లెప్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ‘ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నాం.. సభకు ఎప్పుడు 72 గంటలు ఇస్తాం అని చట్టంలో రాసి ఉంది.. ప్రతి కౌన్సిలర్‌కు సమయం కావాలి.. వారి ఉద్దేశాల్లో ఏదో లోపం కనిపిస్తోంది.. ఏదో చేయాలనే కుట్ర కనిపిస్తోంది. అందుకే ఇదంతా చేస్తున్నారు…’’ అని కేజ్రీవాల్ అన్నారు. న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు ఆప్ రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!