ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన హాథ్రస్లో వెలుగుచూసింది. స్కూల్ యాజమాన్యమే ఒక విద్యార్థిని పొట్టనపెట్టుకుంది. తమ స్వార్థం కోసం ఏకంగా ఒక విద్యార్థిని బలి ఇచ్చింది. ఈ ఘటన భారతీయులను కలిచి వేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఐదేళ్ల బాలిక కేసు విషాదంగా మారింది. చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించింది. చిన్నారి హత్యాచారాకి గురైనట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు కొద్దిరోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన అస్వస్థతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాది అక్టోబర్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టింది. చివరికి అదే నెల వచ్చేటప్పటికీ ఇప్పుడు గురి హిజ్బుల్లా మీదకు మళ్లింది. గత వారం నుంచి హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతోంది. గత వారం కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేసింది. పేజర్లు, వాకీటాకీలను పేల్చి వందలాది మంది ప్రాణాలు తీసింది.
బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఆమె భారత్‌కు వచ్చి తలదాచుకుంటుంది. అనంతరం నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దోషుల విడుదలకు సంబంధించిన తమ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లైంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో 2014-2022 వరకు 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన హాస్టల్ వార్డెన్‌కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు రక్షణను అక్టోబర్ 4 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఐఏఎస్ ఉద్యోగం సంపాదించేందుకు ఆమె అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెపై యూపీఎస్సీ వేటు వేసింది.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. గుర్తింపు కోసమో.. లేదంటే ఇంకేదైనా గొప్ప కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బీహార్‌లో ఓ యువకుడు చేసిన స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
భూమ్మీద మనుషుని పోలిన మనుషులు అక్కడక్కడా ఉంటారంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. జార్ఖండ్‌లో మాత్రం ఒక ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సహజంగా కవల పిల్లలు ఒకేలా.. అచ్చు గుద్దినట్లుగా ఉంటారు. అలా కాకుండా ఒక వ్యక్తిని పోలిన వ్యక్తి ప్రత్యక్షమైతే ఆశ్చర్యంగా ఉండదా?. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆవిష్కృతమైం