అక్టోబర్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే మూడవ వరుస త్రైమాసికానికి పీపీఎఫ్ మరియు ఎన్ఎస్సీతో సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా వచ్చింది. ఎలాంటి మార్పులు చేయలేదని సోమవారం కేంద్రం ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు బంకర్ బస్టర్ గురించే చర్చ జరుగుతోంది. అత్యంత రహ్యస ప్రాంతంలో దాగి ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బంకర్ బస్టర్ అంతమొందించింది. భూగర్భంలో దాదాపు 60 అడుగుల లోతులో అండర్‌గ్రౌండ్‌లో భద్రతా బలగాల కాపుదలలో ఉన్న నస్రల్లాను లేపేసింది. ఇప్పుడే ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియాలో చోటుకున్న యుద్ధ వాతావరణ పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో భారీ నష్టాలతో మొదలైన సూచీలు.. చివరిదాకా రెడ్ మార్కులోనే కొనసాగింది.
క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ మార్పులు, ఆదాయపు పన్ను మార్పులు, పోస్టాఫీసు పథకాల మార్పులు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. నగదు మార్పుల్లో పీఎన్బీ నుంచి ఇటీవలి పొదుపు ఖాతా రుసుములు, డెబిట్ కార్డ్‌ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనలు, చిన్న పొదుపు పథకాలకు సంబంధించిన నిబంధనలు మరియు టీడీఎస్ రేట్లకు సర్దుబాట్లు ఉన్నాయి. ఈ మార్పులన్నీ అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి.
జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో జైషే ఉగ్రవాదులతో భద్రతా బలగాలు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. కతువాలోని బిలావర్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన కుమారుడు ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. ఉదయనిధిని ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారు.
హెలెన్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను బెంబేలెత్తించింది. అతి తీవ్రమైన తుఫాన్ కారణంగా భారీ విధ్వంసం సృష్టించింది. తుఫాన్ ధాటికి ఇప్పటివరకు 52 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అందించే ఇలాంటి ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకాలకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. పెట్టుబడులకు సెక్యూరిటీ, స్థిరమైన రాబడికోసం చూసేవారు ఇన్వెస్టర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు సరియైన ఎంపికగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నిర్ణీత కాలంలో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.