Netanyahu: ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
- ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
- హమాస్.. హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యమని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు హమాస్, హిజ్బుల్లా మీద పోరాటం ఆగదని అంతర్జాతీయ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ సగం బలగాలను అంతం చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ, మరదలికి పంచాయితీ షాక్..
Also Read
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
- Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దండెత్తింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆ నాటి నుంచి ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. హమాస్‌కు వత్తాసు పలికిన లెబనాన్‌పై కూడా దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా ఐరాస వేదికగా నెతన్యాహు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 90 శాతం మంది హమాస్ రాకెట్లను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని చెప్పారు. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని శపథం చేశారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Excise Policy: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు యంత్రాంగం సిద్ధపడాలి..
ఈసారి ఐరాస సమావేశాలకు రావాలనే ఉద్దేశం లేనప్పటికీ.. తమపై కొన్ని దేశాధినేతలు చేసిన అవాస్తవాలను ఖండించడానికే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటుదన్నారు. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని.. దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే ఇటీవల నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాపై పూర్తి స్థాయిలో దాడులు చేయాలని ఆదేశించారు. ఇక ఇజ్రాయెల్ ముందుగా హెచ్చరించినట్లుగానే మరో అడుగు ముందుకేసింది. లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేసేందుకు సరిహద్దు ప్రాంతంలో వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. దీంతో ఏ క్షణమైనా గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Israel-Lebanon: లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?