మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి అదృశ్యమైన జంటలో భర్త రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి భార్య సోనమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్‌పై మస్క్ నిరసన గళం విప్పారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ వ్యతిరేక గళం విప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించినట్లు చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య గత కొంత కాలంగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. దీంతో పాలస్తీనా మద్దతుదారులు ఆయా దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. భారీ స్థాయిలో రష్యా వైమానిక స్థావరాలను ఉక్రెయిన్ డ్రోన్లు నాశనం చేశాయి. సెమీ ట్రక్కుల్లో రహస్యంగా తరలించిన 117 డ్రోన్లతో రష్యన్ బాంబర్లను పేల్చేశాయి.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాద సానుభూతిపరులను భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారులపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వేటు వేశారు.
ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారి మోడీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఒక మహిళ.. తన మేనల్లుడిని ముక్కలు.. ముక్కలుగా నరికి.. అవశేషాలను సిమెంట్ గోడలో వేసి కప్పేసింది. బాధితుడి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.