ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు సహాయమంత్రులు, స్వతంత్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడి త్వరలో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కూడా కేబినెట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Iran: ఇరాన్‌లో కిడ్నాపైన ముగ్గురు భారతీయులు క్షేమం.. రక్షించిన టెహ్రాన్ పోలీసులు
ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పరిస్థితులు, తదనంతర పర్యవసానాలను సహచర మంత్రులకు ప్రధాని మోడీ వివరించే అవకాశం ఉంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: IPL Winner 2025 RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. IPL 2025 విజేతగా ఆర్సీబి..!
అలాగే జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గత వారం సమావేశమైన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కుల గణనపై చర్చించారు. తాజాగా జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Off The Record : కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన ఎమ్మెల్యే, ఎంపీ భేటీ