Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 200MP లైకా కెమెరాతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర ఎంతంటే..?
- షియోమీ 17 అల్ట్రాను అధికారికంగా లాంచ్
- Qualcomm Snapdragon 8 Elite Gen 5 (3nm ప్రాసెస్) ఆక్టా-కోర్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్
- లైకా ట్యూన్ చేసిన రియర్ కెమెరా సెటప్
- 50MP మెయిన్ కెమెరా + 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 17 Ultra: షియోమీ (Xiaomi) ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో నాలుగో మోడల్‌గా షియోమీ 17 అల్ట్రా (Xiaomi 17 Ultra)ను తాజాగా చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Xiaomi 15 Ultraకు వారసుడిగా ఈ మొబైల్ ను తీసుకవచ్చింది. బ్యాటరీ, ప్రాసెసర్, పనితీరు, కెమెరాల పరంగా పాత మోడల్‌తో పోలిస్తే అనేక కీలక అప్‌గ్రేడ్స్‌ను ఈ ఫోన్ అందిస్తోంది. ఈ కొత్త Xiaomi 17 Ultraలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Qualcomm Snapdragon 8 Elite Gen 5) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm ప్రాసెస్ పై తయారైన ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..

ఇక కెమెరా విభాగంలో లైకా ట్యూన్ చేసిన రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. షియోమీ 17 Ultra బేస్ వేరియంట్‌లో 12GB RAM + 512GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర CNY 6,999గా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 90,000 గా ఉంటుంది. ఇక 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7,499 (రూ. 96,000) కాగా.. టాప్ వేరియంట్ అయిన 16GB RAM + 1TB స్టోరేజ్ మోడల్ ధర CNY 8,499 (రూ. 1,09,000) గా నిర్ణయించారు.
Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోడీ..
ఈ డివైస్‌లో భారీ సామర్థ్యం గల 6800mAh Jinshajiang బ్యాటరీను అందించారు. 90W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 27 నుంచి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఇది బ్లాక్, వైట్, పింక్, స్టారీ స్కై గ్రీన్ అనే నాలుగు రంగుల్లో లభించనుంది.
Xiaomi 17 Ultra Leica ఎడిషన్ ధరలను కూడా కంపెనీ వెల్లడించింది. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7,999(రూ. 1,02,000), 16GB RAM + 1TB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర CNY 8,999(రూ. 1,15,000).
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!