PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన
- జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన
- పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
- పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారి మోడీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 19నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. ఇంతలో మూడు రోజులు వ్యవధిలో ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. అనంతరం భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
ఇది కూడా చదవండి: XChat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్‌చాట్.. మొబైల్ నంబర్ లింక్ చేయకుండానే వాడుకోవచ్చు
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
జూన్ 6న చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. అలాగే శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ప్రత్యేక కాశ్మీర్ ఎడిషన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఈ వేదికగా ఉగ్రవాదం అణిచివేతపై ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మోడీ పర్యటన కోసం భద్రతా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!
గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్ దాడులతో దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. అలాగే మరణించిన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!