బాలీవుడ్ నటులపై మత సంబంధమైన వ్యాఖ్యలు చేయడంతో పుణెకు చెందిన లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లో పనోలిని అరెస్ట్ చేసి కోల్‌కతాకు తరలించారు. అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ గత నెల 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వచ్చారు. మూడు రోజుల తర్వాత తూర్పు ఖాసీ హిల్స్ కొండ ప్రాంతంలో అదృశ్యమయ్యారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు.
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురైన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి ఇరకాటంలో పడ్డారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన మరోసారి విమర్శల పాలయ్యారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం కాగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి.. అనేక విషయాలు రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారతదేశానికి చెందిన ఏడు దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నాయి. దాయాది దేశం యొక్క ఉగ్రవాద వైఖరిని ప్రపంచ నేతలకు వివరిస్తున్నాయి.
ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో మాజీమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న హాజరుకావాలని సత్యేంద్ర జైన్‌కు, జూన్ 9న హాజరుకావాలని మనీష్ సిసోడియాకు సమన్లలో ఏసీబీ పేర్కొంది.