అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. గతంలో సుంకాలను పెంచిన ట్రంప్.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా స్టీల్, అల్యూమినియంపై 25 శాతం నుంచి 50 శాతానికి సుంకాలను పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. దీంతో మరోసారి అమెరికా వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. ఆయా దేశాలతో చర్చలు జరుగుతుండగానే ఊహించని విధంగా ట్రంప్ సుంకాలను పెంచేశారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఈ విజయం కోసం నా జీవితాన్ని దారపోశా.. చివరి వరకు ఆర్‌సీబీకే ఆడుతాను!
గత వారం పెన్సిల్వేనియాలోని ఒక ప్లాంట్‌ను ట్రంప్ సందర్శించారు. ఆ సమయంలో ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెంచబోతున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే ట్రంప్ పెంచేశారు. వైట్‌హౌస్ ప్రకారం.. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వులు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
తాజా నిర్ణయం వాణిజ్య భాగస్వాములతో ఉద్రిక్తతలను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ ఇప్పటికే హెచ్చరించింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిపాలనలో దూకుడుగా వెళ్తున్నారు. మిత్రదేశాలతో సహా శత్రు దేశాలపై కూడా భారీ సుంకాలను పెంచే చేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారీ నష్టాలు చవిచూడడంతో సుంకాల పెంపును ట్రంప్ వాయిదా వేశారు. ఓ వైపు ఆయా దేశాలతో చర్చలు జరుగుతుండగా మరోసారి అమాంతంగా సుంకాలను పెంచేశారు. తాజా పెంపు నిర్ణయంపై దేశాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.