దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితం అంతంత మాత్రంగా ఉన్న కేసులు ఈ వారంలో అమాంతంగా పెరిగిపోయాయి. అలాగే మరణాలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి ఈ మంత్రివర్గం సమావేశం అవుతోంది. కేబినెట్ మంత్రులతో పాటు సహాయమంత్రులు, స్వతంత్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లు, క్షిపణి ప్రయోగాలు చేసింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు.. పిల్లలతో కలిసి ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించారు. దేశంలో అనేక ప్రాంతాలను వీక్షించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాలను సందర్శించి సంతోషంగా వెళ్లారు.
టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ, ఈజిప్ట్, సిరియా అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ హర్యానా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ బోల్తా పడింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయగా.. తీరా రిజల్ట్ సమయానికి అంచనాలన్నీ తారుమారయ్యాయి.
భారతదేశం అగ్రికల్చర్‌కు ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. ఇండియాలో పండే పంటలు ఏ దేశంలోనూ పండవు. భారతీయ రైతులు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తుంటారు. ఇక రైతుల ఉత్సాహానికి ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందిస్తుంటాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో గత 48 గంటల్లో కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటి వరకు 30 మంది వరకు చనిపోయారు. ఇక లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. కేంద్రం నియమించిన దౌత్య బృందానికి నాయకత్వం వహించారు. పాకిస్థాన్ వైఖరిని విదేశాల్లో ఎండగట్టేందుకు అధికార-ప్రతిపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపించింది. ఇక కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను కేంద్రం నియమించడంపై వివాదం చెలరేగింది.