ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ముగ్గురు భారతీయులను టెహ్రాన్ పోలీసులు సురక్షితంగా రక్షించినట్లు చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: IPL Winner 2025 RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. IPL 2025 విజేతగా ఆర్సీబి..!
పంజాబ్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్‌బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్‌పూర్) వాసులు మే 1న ఇరాన్ వెళ్లారు. హోషియార్‌పూర్ ఏజెంట్ సాయంతో ఇరాన్ వెళ్లారు. ఇరాన్‌లోకి అడుగుపెట్టగానే దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇక మే 11 నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు. దీంతో టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు. ఇక ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. ఇక ఇరాన్‌కు పంపించిన హోషియార్‌పూర్ ఏజెంట్ కూడా అదృశ్యమయ్యాడు. ఏదో అయిందని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు.
ఇది కూడా చదవండి: Off The Record : కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన ఎమ్మెల్యే, ఎంపీ భేటీ
ఎట్టకేలకు ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేశారు. అయితే టెహ్రాన్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి రక్షించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరి కిడ్నాప్ చేశారు. ఎందుకు చేశారు అన్న విషయాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్..
Three missing Indian citizens freed by Tehran police
Local media in Iran say police have found and released three Indian men who had gone missing in Iran.https://t.co/YAkirkKRHg— Iran in India (@Iran_in_India) June 3, 2025