మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి అదృశ్యమైన జంటలో భర్త రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి భార్య సోనమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
అయితే తాజాగా రాజా రఘువంశీది హత్యగా మధ్యప్రదేశ్ పోలీసులు తేల్చారు. మృతదేహం లభ్యమైన సమీపంలోనే హత్యకు ఉపయోగించిన ఆయుధం, అలాగే నిందితుడి మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య ఈశాన్య రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇక బాధితుడి భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Ritu Varma : ఇలాంటి కథలో నటించడం నా అదృష్టం..
మధ్యప్రదేశ్‌కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి జంట ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. సమాచారం అందిన దగ్గర నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది జంట కోసం వెతికారు. ప్రతికూల వాతావరణంలో కూడా అధికారులు అన్వేషణ సాగించారు. ఎట్టకేలకు రియాట్ అర్లియాంగ్ దగ్గర లోతైన లోయలో రాజా రఘవంశీ మృతదేహాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు. రాజా రఘువంశీ మృతదేహాన్ని వీసావ్‌డాంగ్ పార్కింగ్ స్థలానికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, బంధువులు.. అతని కుడి చేతిపై ఉన్న ‘రాజా’ అని పేరున్న పచ్చబొట్టు ద్వారా గుర్తించారు. అయితే శరీరంపై గాయాలు ఉండడంతో హత్యకు పరిగణించారు. అయితే సోనమ్ ఏమైందన్న ఉత్కంఠ చోటుచేసుకుంది. ఆమెను చంపేశారా? లేదంటే కిడ్నాప్ చేశారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు.
ఇక రాజా రఘువంశీ మృతదేహం దగ్గర కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ తెల్ల చొక్కా.. పెంట్రా 40 మందుల స్ట్రిప్, వివో మొబైల్, ఎల్‌సీడీ స్క్రీన్ భాగం, స్మార్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వాహనం అద్దెకు తీసుకున్న 25 కిలోమీటర్ల దూరంలో రాజా మృతదేహం గుర్తించారని.. అంటే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ముందే ఆలోచించినట్లు సోదరుడు విపిన్ రఘువంశీ తెలిపారు. కొత్త జంట ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నట్లు చెప్పారు. కానీ తన వాదనను పోలీసులు పట్టించుకోలేదన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. జంట ఆచూకీ చెబితే రూ.5లక్షల ఇస్తామని కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.
ఇక ఈ ఘటనపై రాష్ట్ర పర్యాటక మంత్రి పాల్ లింగ్డో దిగ్ర్రాంతి వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ప్రజలు ఓపిక పట్టాలని కోరారు. ఈ ఘటనతో షాక్ అయినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక.. మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.