బీహార్‌లో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో గురువారం మరో అద్భుతం చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా రామమందిర మొదటి అంతస్థులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. మే 23న కొత్త జంట అదృశ్యమైంది.
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తేంటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహచర మంత్రులకు ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలు మన బలాన్ని చూశాయని గుర్తుచేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ట్రంప్ పరిపాలన నిర్ణయాలను మస్క్ ఎండగడుతున్నారు.
దేశంలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. నెమ్మదిగా మొదలైన కేసులు.. ఆ సంఖ్య ఐదు వేలకు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యా్ప్తంగా 4, 866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు నువ్వానేనా? అన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఉక్రెయిన్.. రష్యాను దారుణంగా దెబ్బకొట్టింది. రష్యాకు చెందిన యుద్ధ విమానాలను డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్ పేల్చేసింది. దీంతో రష్యాకు ఊహించని ఎదురు దెబ్బ తగలింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య గంట పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాలు గురించి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై కూడా చర్చించారు.
అమెరికాలో మరొక యూనివర్సిటీకి ట్రంప్ సర్కా్ర్తో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. యూదులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం పని చేస్తుందంటూ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది.
మేఘాలయలో తప్పిపోయిన ఇండోర్ మహిళ సోనమ్‌కు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు ఖాసీ హిల్స్ ప్రాంతంలో సోనమ్‌కు సంబంధించిన రెయిన్ కోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.