Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన విభాగంలో ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఉత్తర్వుల ప్రకారం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను డి. పావనికి అప్పగించగా, అనంతపురం డిప్యూటీ కమిషనర్ పోస్టులో ఎం. అంజయ్య నియమితులయ్యారు. అలాగే, నరసాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా ఆర్. వెంకట్రామిరెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా యు. శారదాదేవిని ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ కమిషనర్‌గా డి. కొండయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.
Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!
మరికొన్ని కీలక మార్పులను పరిశీలిస్తే, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్‌గా ఎం. మంజునాథ్ గౌడ్, రాజంపేట మున్సిపల్ కమిషనర్‌గా లక్ష్మీనారాయణ, గ్రేటర్ విశాఖ (GVMC) జోనల్ కమిషనర్‌గా వి. ఇపి నాయుడులను కేటాయించారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్‌గా డానియల్ జోషప్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు అక్కడ బాధ్యతలు నిర్వహించిన అబ్దుల్ రషీద్‌ను బదిలీ చేస్తూ, ఆయనను తక్షణమే ఎంఏయూడి (MA&UD) కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్‌గా జి. వెంకట రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించనుండగా, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఎస్. బేబిని ఆమె మాతృశాఖ అయిన రెవెన్యూ విభాగానికి ప్రభుత్వం వెనక్కి పంపింది. కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా పి. శ్రీధర్ నియామకం కాగా, ప్రస్తుత కమిషనర్ పి. కృష్ణమోహన్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్టు చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో మున్సిపల్ యంత్రాంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
KTR: నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి?.. తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?