Gmail Address: గూగుల్ (Google) తాజాగా ఒక కీలకమైన అప్‌డేట్‌ను తీసుకరానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా @gmail.comతో ముగిసే గూగుల్ అకౌంట్ ఈమెయిల్‌ను కూడా ఇప్పుడు మార్చుకునే అవకాశం లభిస్తోంది. ఇప్పటివరకు జిమెయిల్ వినియోగదారులు తమ అకౌంట్ ఈమెయిల్‌ను మార్చుకోలేకపోయారు. కానీ non-@gmail.com ఈమెయిల్‌లకు మాత్రం ఈ సౌకర్యం ఉండేది. ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. కాబట్టి వినియోగదారులకు ఇది వెంటనే కనిపించకపోవచ్చు.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త అప్‌డేట్‌తో మీరు మీ ప్రస్తుత జిమెయిల్ అడ్రస్‌ను కొత్త జిమెయిల్ అడ్రస్‌తో మార్చుకోవచ్చు. అయినా కానీ మీ డేటా ఏదీ కోల్పోరు. మీరు ఉపయోగించిన పాత జిమెయిల్ అడ్రస్ సెకండరీ ఈమెయిల్‌గా కొనసాగుతుంది. ఆ అడ్రస్‌కు వచ్చే మెయిల్స్ ఇంకా అందుతాయి. ఇంకా అందులోని ఈమెయిల్స్, చాట్స్, ఫోటోలు, డ్రైవ్ ఫైల్స్ సహా మీ గూగుల్ అకౌంట్ డేటా మొత్తం అలాగే ఉంటుంది.
JC Prabhakar Reddy: ఒక రైతుగా జిల్లా కలెక్టర్ను కలిశా.. దీన్ని రాజకీయం చేయొద్దండి
కొత్త మెయిల్ అడ్రస్ క్రీస్తే చేసుకున్నాక పాత జిమెయిల్ అడ్రస్ లేదా కొత్త జిమెయిల్ అడ్రస్ దేనితోనైనా లాగిన్ కావచ్చు. పాత జిమెయిల్ అడ్రస్ మీ అకౌంట్‌కే లింక్ అయి ఉంటుంది. కొత్త అకౌంట్‌గా మాత్రం 12 నెలల వరకు దానిని ఉపయోగించలేరు. ఒక గూగుల్ అకౌంట్‌లో గరిష్టంగా 3 సార్లు మాత్రమే జిమెయిల్ అడ్రస్ మార్చుకోవచ్చు. గరిష్టంగా 3 కొత్త జిమెయిల్ అడ్రస్‌లను లింక్ చేయవచ్చు.
Gmail అడ్రస్ ఎలా మార్చుకోవాలి?
ముందుగా కంప్యూటర్ ద్వారా అయితే.. myaccount.google.com/google-account-emailకి వెళ్లి లాగిన్ అవ్వండి. అక్కడ Personal Info → Google Account Emailకి వెళ్లండి. అందులో Change your Google Account email address ఆప్షన్ కనిపిస్తే క్లిక్ చేయండి. ఇక అంతే కొత్త Gmail అడ్రస్ ఎంటర్ చేసి అక్కడి సూచనలను అనుసరించండి.
అదే ఆండ్రాయిడ్ లో మీ ఫోన్‌లో Google Account Settings ఓపెన్ చేయండి. అక్కడ Personal Info → Email → Google Account Emailకి వెళ్లండి. అందులో Change Google Account email addressపై ట్యాప్ చేసి కొత్త Gmail అడ్రస్ ఎంటర్ చేయండి.
Lalu Prasad Yadav: లాలూ ఫ్యామిలీకి ఝలక్.. ప్రభుత్వ బంగ్లా నుంచి వస్తువులు తరలింపు!
ఇక iPhone / iPadలో బ్రౌజర్ లేదా Google యాప్ ద్వారా Google Accountలో లాగిన్ అవ్వండి. లాగిన్ తర్వాత Personal Info → Email → Google Account Emailకి వెళ్లండి. ఇక అక్కడ Change Google Account email addressపై ట్యాప్ చేసి ప్రక్రియను పూర్తిచేయండి.