ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ, ఇంజనీర్ రహీద్పై దాడి జరిగింది. రషీద్‌పై ట్రాన్స్‌జెండర్ ఖైదీలు దాడి చేసినట్లుగా జైలు వర్గాలు తెలిపాయి.
తనను గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇరు దేశాల సంబంధాలపై కూడా సానుకూల పరిణామాలను అభినందించారు.
ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ తెలిపారు. శుక్రవారం ఓవర్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలని హమాస్‌తో చాలా లోతైన చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత తర్వగా మరిచిపోయే కేసే కాదు. యావత్తు దేశాన్నే కలవరపాటుకు గురి చేసిన కేసు ఇది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సోదరికి ఘోర అవమానం జరిగింది. ఒకరు దారుణానికి ఒడిగట్టాడు. మీడియాతో మాట్లాడుతుండగా హఠాత్తుగా కోడిగుడ్డు విసిరారు. ముఖం మీద తగలడంతో హడలిపోయింది. ఆమెతో పాటు చుట్టు ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.
వైట్‌హౌస్ వేదికగా గురువారం ట్రంప్ టెక్ సీఈవోలందరికీ ప్రత్యేక విందు ఇచ్చారు. దిగ్గజ సీఈవోలందరూ విందుకు హాజరయ్యారు. కానీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హాజరుకాకపోవడంపై అంతర్జాతీయంగా వార్త చక్కర్లు కొట్టింది.
గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. ఏ దేశం కెళ్లినా ఒకటే ప్రసంగం చేస్తూ ఉండేవారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు యుద్ధాలు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. భారత్-పాకిస్థాన్ యుద్దంతో పాటు ఆరు యుద్ధాలు ఆపానంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు.