జమ్మూకాశ్మీర్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి భద్రతా దళాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరిని హతమార్చారు. తాజాగా సోమవారం కూడా జేకే కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీరును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భర్త మనీష్ గుప్తాను పక్కనే కూర్చోబెట్టుకోవడంపై విమర్శలు గుప్పించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయినా పురోగతి లభించలేదు.
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ శరణార్థిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి దుండగుడు చంపేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగుకి వచ్చాయి.
యుద్ధాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలపై రోజుకో మాట మారుస్తున్నారు. గురువారం టెక్ సీఈవోలతో భేటీ అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడు యుద్ధాలను ఆపానంటూ చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కంత్రీ దొంగ కోటికి పైగా విలువైన బంగారు కలశాలను ఎత్తుకెళ్లిపోయాడు. ఎవరికి అనుమానం రాకుండా పూజారి వేషంలో వచ్చి పాత్రలను ఎత్తుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముగింట అన్నాడీఎంకేలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్పై మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి యాక్షన్ తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తొలగించారు.
పాఠశాల అన్నాక.. కాలేజీ అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ ఈ మధ్య అవి మరింత శృతిమించుతున్నాయి. ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ ఒక విద్యార్థిని సహచర విద్యార్థులు చెంపదెబ్బలతో వాయించేశారు.
ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాతో పాటు 3 రెట్లు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో సరికొత్త అధ్యయనం లిఖితమైంది. హోం కార్యదర్శిగా తొలిసారి ఒక ముస్లిం మహిళ నియమితులయ్యారు. షబానా మహమూద్ హోం కార్యదర్శిగా నియమితులయ్యారు.