ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్‌లోనే పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ రుణాన్ని తగ్గించడానికి సుమారు 52 బిలియన్లను తగ్గించాలనే ప్రణాళికలపై ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జాతీయ అసెంబ్లీ ఓటు వేసింది.
ప్రధాని మోడీ మంగళవారం హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో సహాయ శిబిరాలను పరిశీలించనున్నారు.
గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఒక దురదృష్టకర సంఘటన అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘‘నికోబార్‌లో పర్యావరణ విపత్తును సృష్టించడం’’ అనే శీర్షికతో ది హిందూలో ప్రచురితమైన ఒక కథనాన్ని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఏసీ పేలి భార్యాభర్తలతో పాటు కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. పెంపుడు కుక్క కూడా చనిపోయింది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే భారీ వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హమాస్‌కు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అదే కోవలో ఇజ్రాయెల్ కూడా చివరి హెచ్చరిలు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో టెన్నిస్ ప్రియులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్రంప్ వస్తుండడంతో ఆట ఆలస్యంగా మొదలైంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవంగా ట్రంప్ వస్తున్నట్లు ఎవరికీ తెలియలేదు.
భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వందే భారత్ స్లిపర్ రైలును దీపావళికి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్లిన కొంత మంది భారతీయ మహిళలు పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. జూలైలో ఓ స్టోర్‌లో దొంగతనం చేస్తూ భారతీయ మహిళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.
ప్రజాప్రతినిధి అంటేనే ప్రజలకు సేవ చేసేవాడు. అది మరిచిపోయిన ఓ నేత.. ప్రజల చేతనే పని చేయించుకున్నాడు. బీహార్‌లో వరద ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ఓ కాంగ్రెస్ ఎంపీ చాలా ఓవరాక్షన్ చేశారు. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి వరద ప్రాంతాలను పరిశీలించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే నేతలంతా మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు సహజమే. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి రాద్ధాంతం చేస్తున్నారు.